పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
183
కమలాదేవి.

బొత్తుగాఁ బండనందున దొరతనమువారి కియ్యవలసిన పన్నిచ్చుటకు వారికి శక్తిలేక యుండెను. అట్టిసమయమున గంగాగోవింద సింహుఁడు పొలముపన్ను నెప మిడి వారింటఁగల సమస్తవస్తువులను వేలముపాడించెను. అందువలన వారికిఁ గట్టువస్త్రములుదప్ప రెండవవస్త్రమయినను లేక పోయెను. సద్గుణవతియగు నాకమలాదేవికి నొడలంతయు మూయుటకుఁ జాలినంతవస్త్రమైనను లేకయున్నందున నామెయింటినుండిబైటికి వెడలఁజాలకుండెను. ముగ్గురు పిల్లలనుదెచ్చిన భిక్షాటనపుగింజలు వారికే కడుపునిండకుండెను. ఈదు:ఖమునంతను గని జగన్నాధభట్టాచార్యుఁడు ప్రాణత్యాగము చేయ నిశ్చయించెను. కాని కమలాదేవియతనికిఁ గొంతధైర్యము సెప్పినందున నతఁడు కొన్నిదినములాఁగి యుండెను. తుదకు దారపుత్రాదులదు:ఖముఁ జూడఁజాలక జగన్నాధభట్టాచార్యుఁ డెవ్వరికిని దెలియకుండనొకదినము రివేసికొని ప్రాణములను విడిచెను. అప్పుడు కమలాదేవి యపారమగు దు:ఖసముద్రమున మునిఁగియుండియుఁ దనపుత్రులు బెంగ పెట్టుకొనకుండ వారి నోదార్చుచుండెను. ఇట్లుండఁగా వారిలోఁ బెద్దవాఁడగు క్షేత్రనాధుఁడను వాఁడు తమపొలముల విడుదలకై డిల్లీకిఁ బోవలయునని తండ్రిచెప్పఁగా వినినందున డిల్లీకిఁ బ్రయాణముకాఁగా, కమలాదేవి పోవలదనిచెప్పి యాపెను. కాని పాపండ్రెండు సంవత్సరములబాలుఁ డామాటలను వినక యొక నాటిరాత్రి లేచి డిల్లీకిఁ బ్రయాణమయిపోయెను. కమలాదేవికి దు:ఖములపైదు:ఖములే వచ్చుచుండెను. కాని యామె మిక్కిలి ధైర్యవతిగాన నా యిరువురు పుత్రులను రక్షింపుచుప్రాణములతోనుండెను. ఇట్లుండఁ గొన్ని దినములకు నాబాలకులు