పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
179
రాణీసాహేబ్‌కువరు.

నముల నాసైనికులతో నిట్లనియె. "సైనికులారా! నేను నా ప్రాణములు పోవునంతకు నిచటనే యుండి పోరాడెదను. నేను మీ రాజునకు సహోదరిని; స్త్రీని; నన్ను విడిచిపోవుట శూరులగు మీకు ధర్మము కాదు. యుద్ధమును విడిచిపోయినను మీకొకనాఁటికి మృత్యువు సిద్ధమయియే యున్నది. మీరిదివఱకు సంపాదించిన కీర్తి నేల మాపెదరు? ధైర్య మవలంబింపుఁడు. శత్రువులతోఁ బోరుఁడు." ఇట్లాడిన యామెవాక్యములవలన సైనికులకు శౌర్యస్ఫురణము కలిగి యాదినమంతయు యుద్ధము చేసిరి. నాఁ డుభయపక్షములయందును జాల ప్రజానాశము కలిగెను. ఆదిన మెవరికిని గెలుపు దొరకెనని నిశ్చయించుటకు శక్యము కాక యుండెను. నాఁటి రాత్రి రాణీసాహెబుకువరు సైనికు లామెతో 'మన కిఁక జయము కలుగదనియు నీరాత్రి మన మెచటికైనను బాఱిపోయి ప్రాణములను రక్షించుకొంద మనియుఁ జెప్పిరి. కాని యా శూరనారి కావచనములు రుచింపక యారాత్రి శత్రువులపై నకస్మాత్తుగాఁ బడి వారిని వెళ్ళఁగొట్టుదమని తనసైనికులను బురికొల్పెను. అంత వారందఱును వేకువజామున సన్నద్ధులై నిర్భయముగా నుండిన మరాఠావారి శిబిరముపైకిఁ బోయిరి. ఈసైనికు లచటి కరిగి వారికేమి యపాయము చేయకున్నను వారిసైన్యముల జాగ్రతగా నుండినందున వీరినిఁ జూచినంత మాత్రముననే మిగుల వెఱచి మరాఠావారిసైన్యము పాఱఁదొడఁగెను. అప్పుడు రాణి తనకుఁ దోడుగా గొప్ప సైన్యము