పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/187

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
173
రాణిఔస్కువరు.

డనే రాజ్యము మరల దుస్థ్సితికి రాసాగెను. సైనికులందఱుఁ జెదరిపోయిరి. అందుకు రాజు మిగుల చింతించి రాణిని యామెపుత్రుని, మంత్రిని చెఱవిడిపించి రాజ్యమును మరలఁ జక్కఁజేయుమని భార్యను వేడఁదొడఁగెను. అప్పు డామె తనను మరల చెఱసాలలోఁ బెట్టకుండఁ గట్టుదిట్టములు చేయుఁడనియుఁ దేపతేప తను నిట్లే కారాగృహమునం దుంచినచో జనులు తన్ను మన్నింపరనియుఁ జెప్పి యందుకు జామీ నెవ్వరినైననుంచుమనియెను. ఆమె యంతటితో నూరకుండక యేజంటును బిలిపించెను. ఏజంటు రాకడఁ గనినతోడనే రాజు మరల కోపించెను. ఎట్ట కేల కాయేజంటు రాణికిఁ బట్టముకట్టి చనియెను. ఈతడవ రాణి రాజ్యమనిపేరేకాని దానియం దామె యధికార మెంతమాత్రము జరగకుండెను. రాణిప్రాణములకే గొప్పయాపద వచ్చునట్టుండెను. రాజ్యమునందలి దుష్టులందఱు రాణికి వైరులయిరి. రాజు కొంతసైన్యము పోగుచేసి రాణినిఁ జంప యత్నించెను. ఆమె పేరోలగమున కెవ్వరును రాకయుండిరి. దీని నంతను రాణి యేజంటునకుఁ దెలుపఁగా నతఁడు కొంతసేనతో వచ్చి మహాప్రయత్నముమీఁద సర్వాధికారము రాణిగారికి నిచ్చిరాజుచేతినుండు గురుముఖి రాజముద్రయును నామెకిప్పించెను. రాజునకుఁగొంచెముభూమియు నెల వేతనమును నేర్పఱచెను. రాణి సర్వాధికారిణి యయినను ఆమె తన భర్త యనుమతి వడయనిది యేకార్యము చేసెడిదికాదు. ఆమె రాజ్యమువలన రాజునకు స్వతంత్రత స్థిరముగానే యుండెను. కాని యాభ్రమిష్టున కీస్వతంత్రత కలుగుటవలన నష్టమే కలిగెను. అతఁడు నాతదనంతరము నాపుత్రున కేమియు లేకుండఁ జేసెద