పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణీసంయుక్త.

3

భూపతియు నామెతనను వరియింపవలెననికోరుచుండెను. సంయుక్త మిగుల గంభీరదృష్టితో రాజలోకమునంత నొక్కసారి కలయఁ జూచెను. తన కిష్టుఁ డగుపృధివీరా జచటికి రాలేదనియు ఆయనను బరిహసించుట కాయన ప్రతిమ నొకదానిని జేసి ద్వారమునం దుంచి రనియు నామె కంతకుఁ బూర్వమే తెలిసియుండెను. అందువలన నాబాల యొకగడియవఱకే యోచించి తుదకు దృఢనిశ్చయురాలయి తిన్నఁగా నడిచి ఢిల్లీశ్వరప్రతిమను సమీపించి యామూర్తికంఠమునందుఁ బుష్పహారమును వేసెను. దాని గనినతోడనే సభయం దంతట నొకటే కల్లోల మయ్యెను. జయచంద్రుఁ డిట్టియవమానమును సహింపఁజాలక కోపావేశ పరవశుడైఁ "దుష్టురాలగు దీనిని గారాగృహమునం దుంచుఁ"డని యాజ్ఞాపించెను. అంత రాజు లందఱు నిరాశను బొంది తమతమనగరములకుఁ జనిరి. ఇదియే యీదేశమున జరిగిన కడపటి స్వయంవరము.

ఈ సంగతి యంతయు విని పృథివీరాజు పరమానందభరితుఁ డయ్యెను. జయచంద్రుఁడు తనను బఱచిన యవమానమును సంయుక్త తనయందుఁ గనఁబఱచిన ప్రేమయు నేకీభవించి తన్నుఁ ద్వరపెట్టఁ బృథివీరాజు జయచంద్రునిపై యుద్ధయాత్ర వెడలెను. ఇట్లాయన శూరులగు యోధులతోఁ గనోజపట్టణము సమీపమున విడిసెను. అచట నున్న కాలమున నే యొకరాత్రి మిగుల రహస్యముగాఁ బృథివీరాజు సంయుక్తను గలిసి గాంధర్వవిధిచే నామెను వరియించెను.

వీరివివాహవార్త యొకరిద్దఱు దాసీలకుఁ దప్ప నితరుల కెంతమాత్రముఁ దెలియదు. పృథివీరాజు వచ్చి తనగ్రామముబైల