పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/169

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
155
సత్యవతి

సత్యవతి రాత్రిందివములు నడచి మూఁడుదినములకు కలకత్తానగరము ప్రవేశించెను. అచట బందిఖానా రామానందులను బట్టిన యధికారి చేతిదిగాక యతనికంటె గొప్ప యధికారిచేతిలో నుండెను. అందువలన నచటవ్యాజ్యమునకుఁ బోయినచో ప్రేమానందుఁడు విముక్తుఁడగునని తెలిసెను. కాని యాకోర్టు వ్యాజ్యమునకు విశేషద్రవ్యముకావలసియుండెను. ద్రవ్యముకొఱకు సత్యవతి విచారింపుచుండఁగా, నాగ్రామమునందు గంగా గోవిందసిహుఁ డనుగృహస్థు నింటికి యాచనార్థము కొందఱు బ్రాహ్మణు లరుగుచున్న ట్టామెకుఁ దెలిసెను. అప్పు డామెయు బురుష వేషముతో నచటి కరిగెను. కానియచట నేమియుఁ దొరకదయ్యె. అంత నాసాధ్వి మిగులచింతించి రాజవీధిలో నొకవృక్షచ్ఛాయను గూర్చుండింద్రాహారములు లేక కొన్నిదినములు గడపెను. అంత నొకదిన మాత్రోవ నొకగొప్ప యుద్యోగస్థుఁ డరుగుచుండెను. ఆయన చేతిలోనుండి యతనికిఁ దెలియకయే కొన్ని యగత్యములైన కాగితములు క్రిందఁ బడెను. అవి పడుటనుగని త్వరగా సత్యవతి వానినెత్తి తెచ్చి యాగృహస్థున కిచ్చెను. వానిని దీసికొనియాతఁ డాబాలకునికి మిగుల కృతజ్ఞుఁడయి "నీవు నాకువచ్చు గొప్ప యాపదలను దొలఁగించితివి. నీ కేమికావలయునో యడుగు"మనెను. అందుకు నామె తనబంధుఁడొకఁ డాయూర బందివాసములో నుండినందున నతని విడిపింపవచ్చి ద్రవ్యహీనతవలన నాపని సాధ్యముకాక యుండెననియు, తమ రాకార్యమునకుఁ దోడుపడ వలెననియు వేఁడుకొనెను. అందు కాగృహస్థుఁడు సమ్మతించి రామకృష్ణుని (సత్యవతినామము) యిచ్ఛప్రకార