పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/159

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
145
విమలదేవి

ట్టిన నిన్నుఁజూచినదోసమువచ్చును. నేను నాయుసురులుబొందిని విడిచిపోయినను తురకల చెట్టఁబట్టక మేటిమగండగు రజపూత పుడమిఱేనిఁ బెండ్లియాదెద" ననియుఁ బ్రతినవట్టెను. అందుకామెయక్క "నిన్నుఁ దురకల కిప్పించకుండిన నేను ఔరంగజేబున కింతినేకాను" అని డిల్లీకరిగి తనమగని కాకతయంతయుఁ జెప్పి యతనిచేవిమల నిమ్మని తన తల్లిదండ్రులకు జాబు వ్రాయించెను.

విమలదేవియుఁ దాఁ జేసిని ప్రతినఁ దల్లిదండ్రులకుఁ జెప్పఁగా వారు మెచ్చియామెను గొనియాడిరి. కాని యౌరంగజేబు వద్దినుండి వచ్చినజాబునుచూచుకొనిన పిదప వారు మిగుల వెఱచి విమల నతని కియ్యఁదలఁచిరి. దీనింగని విమల మిక్కిలి నొగిలి సిసోదియా రాచకొలంబునఁ బుట్టిన రాజసింహుఁడు నాఁబరఁగు రాచకొమరుని బీరమ్ము నదివఱకువిని యున్నదిగాన నతని కొకజాబువ్రాసి తమయొజ్జలచేత నతనికిఁ బంపెను. ఆజాబులో నామె 'ఆఁడయంచ కాకికి నాతియగుట దగునా? దోసమెఱుఁగని దొరకొలంబునఁ బుట్టిన కన్నియకోఁతిమూతివాఁడును బోడితలవాఁడునునైన తురకఁ గూడుట యింపగునా? వెన్నుఁడు రుక్మిణిం దీసికొనిపోయినటుల నన్నుఁ గొనిపొండు. మీ ఱొకవేళ నన్నుఁ గాపాడరాకుండిన నేను నామేనుం జాలించెదను. ఇది నిజము' అనివ్రాసెను. ఈజాబుంగొని చనిన పుడమివేల్పు విమలయొక్క మంచి గొనముల నారాచసింగంబునకుం జెప్పఁగా నతఁడు తురకలపై కరం బలిగి గొప్ప దండుతో రూపనగరమునకు బయలుదేరెను. ఈలోపలఁ బెండ్లిమూర్తము దగ్గర వచ్చి నందున నౌరంగజేబు పెండ్లికొ