పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/157

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
143
మహారాణీఝాశీ లక్ష్మీబాయి

విషయమై చూపిన యపారమయిన యౌదార్యమువలను, గొప్పగొప్ప సంకటసమయములయందును చలింపని ధైర్యము గలదియై యుండినందునను, సైనికులలో నామెనుగుఱించి పూజ్యభావము హెచ్చి యామెపక్షము మాకు భయంకర మయ్యెను."

"గ్వాలేరులో జరిగిన యుద్ధముయొక్క గొప్ప పరిణామము ఝాఁశీరాణియొక్క మృత్యువు. ఆమె యబలయయినను మాతోఁ దిరుగఁబడిన వారిలో నతిశూరయు నత్యుత్తమసేనాగ్రణియునై యుండెను."

(2) "ఆయుద్ధమునందు నత్యంత దృఢనిశ్చయమును, తేజమును, జనానురాగమును గలిగినట్టి సైన్యాధ్యక్షురాలయిన ఝాఁశీరాణి చంపఁబడెను." డాక్టరు లో.

(3) "లక్ష్మీబాయి నడితారుణ్యములో నుండినందున నత్యంత సుందరముగా నుండెను. ఆమెమనసు ఉత్సాహపూర్ణముగాను, శరీరము మిక్కిలి సశక్తముగాను నుండెను, ఆమె యందు, ప్రాణముపోయినను చింతలేదుగాని మానహాని సహింపనన్న యభిమానముండెను." మార్టిన్ దొర.

(4) "ఏస్త్రీని రాజ్యతంత్రము నడుపుటకు నసమర్థు రాలనియెంచి, మేము రాజ్యభ్రష్టముగాఁ జేసితిమో యాస్త్రీయే ప్రచండసైన్యముయొక్క యాధిపత్యమును స్వీకరించుటకు సంపూర్ణముగా సమర్థురాలని మాకు నిప్పుడు తెలిసెను." ఎడ్విను ఆర్నోల్డుదొర.

(5) "శత్రువులలో నత్యుత్తమమనీషి ఝాఁశీయొక్క మహారాణియే" జస్టిన్ మ్యాకర్తిదొర.