పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142
అబలాసచ్చరిత్ర రత్నమాల.

రాణిగారి యాజ్ఞప్రకార మామెశరీరము శత్రువులచేఁ బడకుండ గుప్తముగా నగ్ని సంస్కారము చేసెను.

అటు పిమ్మట నాయుద్ధమునందు జయ మొంది అంగ్లేయ సేనాధిపతులు సిందేగారికి మరల రాజ్యము నిచ్చిరి. తదనంతర మాసేనానాయకులు క్రమముగా బందిపోటు వారి నడఁచి క్రమముగా తాత్యాటోపేను నితర సైన్యాధీశ్వరులను నురితీయించిరి. బందేవాలా నవాబు శరణుచొచ్చి క్షమకుఁ బాత్రుఁడయ్యెను!

ఇంగ్లీషుప్రభువు లిట్లు విజయులయినందున మనకు స్త్రీవిద్యాదికములచే నత్యంత లాభప్రదమైన విక్టోరియా మహారాజ్ఞిగారి రాజ్యము ప్రాప్తించెను.

రాణిగారి దత్తపుత్రుఁడు తల్లి యనంతర మనేకకష్టము లనుభవించి ప్రస్తుతము నెల కేఁబదిరూపాయల జీవనము గలిగి సామాన్యమానవునిరీతి ఇందోరుపట్టణములోఁ గాలము గడపుచున్నాఁడు. ! ! !

లక్ష్మీబాయి యింగ్లీషువారితోఁ బోరాడినప్పటికి ననే కాంగ్లేయు లామె శౌర్యాతిశయముల ననేకరీతులఁ గొనియాడినారు. వానిలోఁ గొన్నిఁటి నిచ్చట నుదాహరించు చున్నాను : _

(1) రాణిగారికిఁ బ్రతిపక్షియై ఆమె నోడించిన సర్ హ్యూరోజ్ సైన్యాధిపతియే 'గుణీగుణం వేత్తి' యన్న న్యాయమున రాణిగారినిగుఱించి యిట్లువ్రాసెను.

"రాణీలక్ష్మీ బాయియొక్క అత్యున్నతమైన కులీనత వలనను, ఆమె యాశ్రితజనులవిషయమయి మఱియు సైనికుల,