వ్యూహములు వన్ని నిలిచిరి. రాణిగారు గ్వాలేరు పూర్వదిక్కు సంరక్షింతునని తనసైన్యమునచటనే మోహరించి నిలిచిరి.
17 వ తేదిని బ్రిగేడియర్ స్మిథ్ అనుసైన్యాధిపతి గ్వాలేరు పూర్వదిక్కుననున్న సైన్యములపై బాణవృష్టి చేయసాగెను. అది రాణిగారి బలమగుటవలన నాసైనికు లింగ్లీషు వారిబలములనాదినమున ధైర్యముతో మార్కొనినిలిచిరి. రెండవదినమును లక్ష్మీబాయిగారి వీర్యోత్సాహవచనములవలన నాసైన్యములు పరబలంబులంబొడిచితామును మృతులగుచుండిరి. లక్ష్మీబాయిగారి శౌర్యముం గని యాంగ్లేయ సేనానాయకులు మిగుల నద్భుతపడి యామె నోడింప నిశ్చయించిరి. ఇట్లు వారు నిశ్చయించి నలుదిక్కులనుండి యామె సైన్యముపై బాణపరంపరలు పఱపుటచే నా సైన్యంబులు నిలువక పాఱఁ జొచ్చెను. ఇట్లు తన ముఖ్య సేవకులు కొందఱుదప్ప నందఱును తనను విడిచినందునను. అంతకుముందే యితర సేనాధిపతు లపజయమునుబొంది పలాయితులగుటవలనను, లక్ష్మీబాయి తనఖడ్గబలముచే శత్రుసైన్యములలోనుండి యనేకశూరులం బొడుచుచు నావలకుఁ బోవుచుండెను. ఇట్లామె బహుదూరము వెళ్ళిన పిదప నామెతో పురుష వేషము ధరించియున్న 'ముందర' యను దాసియొక్క యంతిమశబ్ద మామె చెవినిఁబడెను. అందువలన నామె వెనుక తిరిగి తన ప్రియదాసినిఁ జంపినవానిని యమపురమున కనిపి ముందుకుసాగెను. ఇట్లు ముందతిత్వరగా నరుగుచుండ నొక జలప్రవాహ మడ్డపడినందున ననేక గాయములచే క్షీణించియున్న యామె గుఱ్ఱ మాప్రవాహమును దాటఁజాలక నిలిచెను ! లక్ష్మీబాయిగా రాగుఱ్ఱము నావలకుఁ దీసికొని