పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

అబలాసచ్చరిత్ర రత్నమాల.

గాఁ బోరి పిదప సిందే సైన్యములకే గెలుపుదొరకు నట్లయ్యెను. అది గని రాణిగారు తాను ధైర్యముతోఁ గొందఱాశ్వికులనుగొని సిందేగారి ఫిరంగీలపై నాకస్మికముగా నడరి మహాఘోరముగాఁబోర సిందే సైనికులు పాఱఁజొచ్చిరి. అదిగని తాత్యాటోపే సైనికులు మఱింత యుత్సాహముగలవారయి శత్రుసైన్యములను నదలింపసాగిరి. కాన సిందేగారి పరాక్రమ మంతయువృధవోవ నాతఁడును, దివాను దినకర్ రావును మఱికొందఱు సరదార్లతోఁ దనకుసహాయులగుఁడని యడుగుటకుగాను ఆగ్రా కిల్లాలోనున్న ఆంగ్లేయుల యొద్ది కరిగెను. విపుల సైన్యసమేతుఁడగు నొకతరుణ నృపుని నల్పసైన్యముఁగల యొకయబల తనశౌర్యముచేఁ బాఱఁదోలెను. ఇందువలననే యొకకవి యిట్లు నుడివెను : _

[1]

 'క్రియాసిద్ధి: సత్వేభవతి మహతాం నోపకరణే'

సిందేగారు పురము విడిచి చనినవెనుక నాతని రాణివాసపు స్త్రీ లందఱు ఆత్మసంరక్షణముకొఱకు నరవర యనుపురమున కరిగిరి. వీరందఱు బయలుదేరి కొంచెముదూర మరిగిన పిదప సిందేశత్రువులచేఁ బడెనని విని గజరాయను నొకస్త్రీచేత ఖడ్గముధరించి రాజభవనమునకు వచ్చి రాజు సురక్షితముగా వెళ్లినవార్త విని వెనుక మరలెను. ఆహా యీస్త్రీయొక్క ధైర్యము ఆసామాన్యముగదా?

రాజు పలాయితుఁడయిన వెనుక సకల సైన్యములు తమ కనుకూలములయినందున పేష్వాగారికి నగరు ప్రవేశిం

  1. గొప్పవారి కార్యసిద్ధి వారిపరాక్రమమువలననే యగును; కేవల సామగ్రి బలమువలనఁ గాదు.