పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబలాసచ్చరిత్రరత్న మాల.

రెండవ భాగము.

రాణీ సంయుక్త.

12 వ శతాబ్దమునందు రారోడ్‌వంశీయు డగుజయచంద్రుడు కనౌజ (కాన్యకుబ్జ) రాజ్యమును, చవ్హాణవంశోద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలించుచుండురి. ఈయసామాన్యపరాక్రమవంతు లిరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురును పృధివీరాజునకు భార్యయు నయ్యెను. కాన నా రెండువంశములును నామెవలన బవిత్రము లయ్యె ననుటకు సందేహము లేదు.

జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతు రగుట వలన జయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచెను. సంయుక్త స్వభావమువల్లనే సద్గుణవతిగాన బెరిగినకొలదిని ననేకవిద్యల నేర్చి మిగుల నుతి కెక్కెను. ఆమె సద్గుణములును లావణ్యమును గనిన ప్రజ లందఱు దమజన్మము సార్థక మయ్యెనని తలచి సంతసించుచుండిరి. ఇట్లీమె కొన్నిదినములు బాల్యావస్థయందు గడపి యౌవనావస్థందాల్చెను.

ఇట్లు యుక్తవయస్కురా లగుబిడ్డకు దగినవ రు డెవడాయని జయచంద్రుడు చింతింపసాగెను. సంయుక్త రూపలావణ్యములకీర్తి సకలదిక్కులను వ్యాపిం నందున ననేకరాజపుత్రు