పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

అబలాసచ్చరిత్ర రత్నమాల.

తో నాంగ్లేయసైన్యంబులతోఁ బెనఁగుచు దానిఁ బాయఁగాఁ జీచికొని కాల్పీమార్గమున నరిగెను.

రాణీగారు తమసైన్యములలో నుండి కాల్పీమార్గమున వెళ్లిన సంగతి విని సర్ హ్యూరోజ్ దొరగారు నఖేదాశ్చర్య మగ్నులయిరి. ఆయన యంతటితో నూరకుండక యొక సేనానాయకునిఁ గొంత సైన్యసహితముగా నామెను వెంబడింప నంపెను. కాని రాణిగారు వారికి దృగ్గోచరముగాక తనగుఱ్ఱము నతిత్వరగా నడుపుచుండెను. జన్మాదిగా యుద్ధమన్న మాట యెఱుఁగక సదా రాణివాసమునందు వసియించు బ్రాహ్మణ వితంతువు వీరుల కభేద్యమగుహూణసైన్యమును భేదించుకొని క్షణములో నదృశ్యయగుట కెవ్వ రాశ్చర్యపడకుందురు ?

మహారాణీ లక్ష్మీబాయిగా రారాత్రి బయలుదేరి తనను బట్టవచ్చువారికిదృగ్గోచరయుఁగాక సూర్యోదయమునకుఁఝాశీ సంస్థానమునకు సరిహద్దయిన భాండేరయను గ్రామమునఁ బ్రవేశించెను. అచట నామె గుఱ్ఱమును దిగి కొమారునకు ఫలాహారముఁ బెట్టి మరల నశ్వారోహణము చేసెను. ఇంతలో నాంగ్లేయసైన్యాధిపతి కొంతసైన్యముతోఁ దనను బట్టవచ్చెననియామె వినెను. ఆసమయమునం దామెయొద్దఁ బదునైదుగురుశూరులు దప్ప వేరుసైన్యము లేదు. అట్లయ్యును ఆశూరశిరోమణి జంకక తనఖడ్గము నొరనుండి తీసి యుద్ధసన్నుద్ధయైచను చుండెను. ఇంతలో నాసైనికు లామెనుముట్టడించిరి. కాని యామె తనయుద్ధనైపుణ్యమువలన నాసైనికులను చీకాకు పఱచి కొందఱిని యమసదమున కనిచి క్షణములో నదృశ్య యయ్యెను. బహుసైన్య సమేతముగా నున్న యాంగ్లేయ సేనాధ్యక్షుని