పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహారాణీఝాశీ లక్ష్మీబాయి

133

వారికి నిదివఱకుఁ గలయధైర్య మంతయు నడుగంట శత్రువుల పై నధికోత్సాహముతో తప్తగోలవర్షముఁ గురిపింపసాగిరి.

ఏప్రియల్ 2 వ తేది వఱకును యుద్ధము చేసియుఁ దాము పురప్రవేశము చేయ లేకుండుటకు మిగుల చింతిల్లి సర్ హ్యూరోజ్ దొరగారు తమబుద్ధి ప్రవీణతవలన నాదినమున నాకిల్లాను చేకొనఁదలఁచిరి. ఆయన తదనుసారముగా బలంబుల నంప వారును మిగుల నుత్సాహముతో శత్రుపక్షమునుండి వచ్చుబాణములను సైచిగ్రామద్వారములనుండియుఁ గోటగోడనుండియుఁ బురముఁ జొరసాగిరి. తాతాటోపేగారి పరాభవమును విని రాణిగారి సైనికులు మిగులనిరుత్సాహులైరి. అయినను యుద్ధమునందుఁ దెగఁగా మిగిలినవారికి రాణి గారుతమవాక్యమువలన శౌర్యముపుట్టించి సంగ్రామము నడుపుచుండిరి. 3 వ తేదిని తమ్ము నెదిరించువారు లేక హూణబలంబులు పురమంతటను వ్యాపించెను. 4 వ తేదిని పట్టణమంతయు వారి స్వాధీనమాయెను.

తానిన్నిదినంబులు చేసినశ్రమ వృధయైపోవ శత్రువులు తననగరము నాక్రమించుటఁగని రాణిగారు మిగుల విచారపడిరి. కాని యామె యంతటితోనైన ధైర్యము విడువక కర్తవ్యము నాలోచించి జయోత్సాహులగు శత్రువు లిఁక తనకిల్లా నాక్రమించి తనను బంధింతురని కని యామె యెట్లయిన రణరంగమున ప్రాణములు విడువ నిశ్చయించెను. అంత నామె పురుష వేషముతో బయలుదేర నిశ్చయించి తనదత్తపుత్రుని యం దధికప్రీతి గలదిగాన నాచిన్న వానిని తనమూపునఁ గట్టుకొని అశ్వారోహణముచేసి నాల్గవతేదిరాత్రి స్వల్పసైన్యము