పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
131
మహారాణీఝాశీ లక్ష్మీబాయి

యుద్ధమున కనుకూలమగు శిక్షను గఱచియుండుటచేతను వారి సైన్యములు చెదరక యుద్ధముచే గెలుపొందుట యొక వింత కాదు. ఇక రాణిగారిసైన్యము లన్ననో యుద్ధశిక్ష నెఱుఁగనట్టి బందిపోటు వారితోఁ గలిసి జనసంఖ్య కెక్కువగాఁ గానుపించినను, వారలంద ఱొకప్రకారము యుద్ధము చేయఁజాల నందున విశేషముగాఁ జెదరుచుండిరి. ఇంతటి విశేషసైన్యమున కంతకును రాణిగారే సేనా నాయకత్వము వహించి నడుపుట బహుదుర్ఘటమని యందఱకును దెలిసినదే. అయినను ఆవీర వనిత తనబుద్ధిచాతుర్యమువనను, శౌర్యసంపదవలనను ప్రఖ్యాతులగు ఆంగ్లేయ సేనా నాయకులతోఁ బ్రతిఘంటించి యుద్ధభూమిని నిలిచి యనేక దినములు సంగ్రామము సల్పి వారిచే 'నీమెను గెలుచుట దుర్ఘట' మనిపించుట మిగుల వింతగదా?

ఆ యుద్ధసమయమునందు రాణిగారు సైన్యమం దంతటనుతనదృష్టి నిగిడింపుచు నచటఁ గలకొదవలనుదొలఁగింపుచు సైనికుల కనేక బహుమానము లిచ్చుచు, యుద్ధధర్మములను దెలుపుచు వారిని యుద్ధమునకుఁ బురికొల్పి వారి మనంబుల వీరరస ముద్భవిల్లఁ జేయుచుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వచ్చినవారికి కామె సమక్షముననే చికిత్స జరిగింపు చుండెను. అప్పు డామె మిగుల జాలిపడి వారిపైనుండి తన హస్తమును త్రిప్పఁగా నాసైనికు లధికా వేశపరవశులయియుద్ధముచేయ నుంకింపుచుండిరి. ఇట్టిస్త్రీరత్నములు జన్మించుట వలననే కదా స్త్రీలకును, పురుషులను బోలిన ధైర్యశౌర్యములు గలవని యందఱకును దెల్లంబయ్యె.