పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/140

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
126
అబలాసచ్చరిత్ర రత్నమాల.

ప్రకార మచటి కరిగి కోటద్వారముల మూసికొనిరి. కాని మరుసటిదినముననే యా తిరుఁగబడిన పటాలములవారు సేనలో మొనగానిఁ జంపి యుప్పొంగి కిల్లాను చుట్టుముట్టి బహుప్రయత్నముల నచటివారి నీవలకుఁదీసి యతిక్రూరులై వారనందఱి నేకక్షణముననే యమసదనమున కనిచిరి. వారట్లాయూర నొక యాంగ్లేయ ఆఇశువు సహితము లేకుండఁ జేసి ఝాఁశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారిదని ధ్వజమెత్తిరి. అప్పటినుండి రాణిగారు పటాలములతోఁగలిసి స్వతంత్రించిఝాఁశీసంస్థానమున తనరాజ్యమును స్థాపించ యత్నించఁ దొడఁగెను. ఆనాలుగురోజుల నయినరాణిగారు రాజ్యవ్యవస్థ మిగుల నిపుణతఁ జేసిరి. ఆమె తన నేర్పువలననే యేపనుల కెవ్వ రెవ్వరు యోగ్యులో యాయాపనులకు వారివారిని నియమించెను. కాని పూర్వపు ఉద్యోగస్థులను దొరతనమువారిదివఱకే తీసివేసిమందున రాణిగారికి దగినయుద్యోగస్థు లాసమయమున దొరకకుండిరి. అయినను ఆమె తనవలన నగునంతవఱకును సిద్ధపఱచి దుర్గసంరక్షణనిమిత్తము క్రొత్తసైన్యమును సిద్ధపఱచెను.

ఝాఁశీరాజ్యము మహారాణి లక్ష్మీబాయిగారు పాలింపుచున్న సంగతి విని వారి వంశీకుఁడగు సదాశివనాధాయణ యనునాతఁడు ఝాఁశీ సమీపమునందున్న కరేరాయను దుర్గమును వశపఱచుకొని యచటఁ దాను ఝాఁశీరాజ్యాభిషేకముఁ గావించుకొనెను. అబలయగు రాణిగారు రాణివాసమునందుండునదిగాన నామె తనకు లొంగునని తలఁచెను. కాని రాణిగారు సబలయై సైన్యమునంపి యాతనిఁబట్టి తెప్పించి ఝాఁశీ కిల్లాలో బంధించి యుంచెను.