పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/138

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
124
అబలాసచ్చరిత్ర రత్నమాల.

వారు రాజ్యమును తాముస్వాధీన పఱుచుకొని పశ్చిమోత్తర పరగణా గవర్నరుగారికచటి రాజ్యము నడుప ననుజ్ఞ ఇచ్చిరి. వారు రాజ్యము స్వాధీనపరచుకొని రాజ్యమునకును రాజకుటుంబమునకు నిట్లు కట్టుబాట్లు చేసిరి.

గ్రామమునం దున్న రాజభవనము రాణిగారి కుండుటకుఁగా నిచ్చి కిల్లాతాముతీసికొనిరి. మిగిలినసంస్థానమునందలి నగలు మొదలగు ధనమంతయు దత్తుపుత్రునకు మైనారిటీ తీరిన వెనుక నిచ్చుటకుగాను తమయొద్దనే దాఁచిరి. రాణిగారు జీవించియుండునంతవఱకు (5000 అయిదువేలరూపాయ)లామెకు నెలవేతనముగా నేర్పరచి యంతవఱకును ఆమెపైఁ గానిఁ యామె యితర భృత్యవర్గము పైనిఁగాని తమచట్టములు నడువఁగూడ దనియు వ్రాసియిచ్చిరి.

అందుకు ముందున్న రాణిగారి సైనికులకు విశ్రాంతిఁ గలుగఁజేసి వారికి బదులుగాదమసేన నుంచిరి.

రాణిగారికి అయిదువేలరూపాయల వేతనమిత్తుమని దొరతనమువారు వ్రాయుటయేగాని తనరాజ్యముతనకు దొరకవలయు నన్నయుత్కటిచ్ఛఁగల రాణిగా రాయల్ప త్రమును మరణపర్యంతమును స్వీకరించినవారు కారు. అంత నూరకుండక లక్ష్మీబాయి సీమలో నపీలు చేయఁ దలఁచి ఉమేశచంద్రబానర్జీయను వంగదేశీయునిని మఱియొక ఆంగ్లేయప్లీడరును ఆఱులక్షలరూపాయ లిచ్చి యింగ్లండునకుఁ బంపెను. కాని, వారచటికరిగి యేమి చేసినదియు నెచట నున్నదియు నేఁటివఱకును దెలియదు. వారచట ననేకోపాయముల జేసెదరనియు వారి