పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
123
మహారాణీఝాశీ లక్ష్మీబాయి

ఇట్లు దత్తవిధానమయినపిదప గంగాధరరావుగారు దివానుగారిచే నొకవిజ్ఞాపన పత్రము హిందూస్థానపు దొరతనమువారికి వ్రాయించి దానిపై తమవ్రాలు చేసి దానిని తమ హస్తములతో పొలిటికల్ అసిస్టెంటుగారి కిచ్చిరి. అందులోఁ బూర్వ మింగ్లీషు వారు తన తండ్రిగారితో జేసిన కరారు ప్రకారము తమ వంశపారంపర్యముగా రాజ్యము దొరకవలయుననియు, తనకు నౌరససంతతిలేనందున నొక దత్తపుత్రుని స్వీకరించితిననియు, దొరతనమువా రాదత్తు విధానమునకు సమ్మతించి వానికి రాజ్యమొసంగి వాఁడు పెద్దవాడగువఱకు వానిపేర తన పత్నియగు లక్ష్మీబాయి పాలించునట్లు చేయుఁడనియు వ్రాసిరి. విజ్ఞాపనపత్రిక వ్రాసిన దినముననే గంగాధరరావు పరలోకఁ గతుడయ్యెను. కులాచార ప్రకారము రాజుగారికి ప్రేతవిధులన్నియు జరుఁపఁబడెను. తదనంతరమునఁ గొన్ని దివసంబులకు లక్ష్మీబాయి సర్వానుమతంబునం దనపుత్రునకు రాజ్యమిమ్మని దొరతనమువారికొక విజ్ఞాపనపత్రికను వ్రాసెనుకాని యామె యుద్దేశ్యము సిద్ధించినదికాదు.

ఆవిజ్ఞాపనప్రకారము దొరతనమువారు దమదత్తతను స్వీకరించి రాజ్యమిత్తురని ఝాఁశీసంస్థానమున నందఱునుకొండంత యాసతోడ నుండఁగా 1855 వ సంవత్సరము మార్చినెల 25 వ తేదిని దత్తవిధానము దొరతనము వారంగీకరింపక రాజ్యమును తామే స్వాధీనపరచుకొని రనినసంగతి తెలిసెను. కాన లక్ష్మీబాయికిఁ బతి వియోగ దు:ఖమునకు దోడు రాజ్యవియోగ వ్యసనము సంప్రాప్తమాయెను. దొరతనము