పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/133

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
119
మహారాణీఝాశీ లక్ష్మీబాయి

బహు సుఖకరముగాఁ గడచెను. ఆభార్యాభర్త లిరువురును పరస్పరానురాగము గలవారై కాశీక్షేత్రమున వసింపఁ గొన్ని దినములకు భాగీరధీబాయి గర్బముధరించి 1835 వ సంవత్సరము నవంబరునెల 19 వ తేదిని సుఖప్రసవమై స్త్రీశిశువును గనెను. తాంబేగారి శూరవంశమునఁ గాశీక్షేత్రమున జన్మించిన కన్యారత్నమే లక్ష్మీబాయి. జాతకర్మ నామకరణమహోత్సవములు బహు సంతోషముతో నడపి మోరో పంతుగా రాచిన్నదాని పేరు "మనూబాయి" యని పెట్టిరి. ఈ బాలిక దినదినప్రవర్థమాన యగుచుఁ దనముద్దుమాటల వలనను, మనోహర మగుస్వరూపమువలనను జననిజనకులను, వారిపరివారమును మిగుల నానంద పఱుపుచుండెను. ఇట్లీ బాలికారత్నంబు సకల జనాహ్లాదకరంబుగాఁ బెరుగుచుండ నామె మూడునాలుగు సంవత్సరములది యగువఱకు తన్మాతయగు భాగీరధీబాయి పరలోకగతురా లాయెను. ఈసమయముననే యప్పాగారును కైలాసవాసు లగుటవలన మోరోపంతుగా రచటినుండి బ్రహ్మవర్తమునకుఁ బోవ తటస్థించెను. అచట బాజీరా నీయనను మిగుల ప్రేమించి కుటుంబసంరక్షణ చేయుచుండెను.

మనూబాయికి బాల్యముననే జననీవియోగము తటస్థించినందున నామెతండ్రిగారి పోషణలోనే యుండుచు, నెల్లప్పుడు ఆయనను విడువక పురుషులలోనే సదా తిరుగుచుండెను. తల్లిలేని పిల్లయగుటవలనను, సుస్వరూప మధురభాషిణి యగుటవలనను శ్రీమంతులవద్ద నుండువా రందఱును మనూబాయిని మిగుల గారాబము చేయుచుండిరి. పేష్వాగారిదత్త