పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/131

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మహారాణీ ఝాశీలక్ష్మీబాయి.

భరతఖండమునందు శౌర్యమహిమవలనఁ బ్రఖ్యాతలయిన యువతీరత్నములలో ఝాశీలక్ష్మీబాయి యగ్రగణ్యురాలు. ఈమె శౌర్యాగ్ని 1857 వ సంవత్సరమువఱకును డాఁగియుండి యాకస్మికముగాఁ బ్రజ్వలించెను. ఈమెరాజ్య ముత్తరహిందూస్థానము నందలి బుందేలఖండ మనుప్రదేశము నందలి యొకభాగము. ఈరాజ్యము లక్ష్మీబాయిగారి మామగారి యన్నయగు రఘునాధరావుగారి ప్రతాపమునకు మెచ్చి పూర్వము ఈపూనా పేష్వగా రిచ్చిరి. ఆయనకుఁ బుత్రులు లేనందున ఆయనతమ్ముఁడగు శివరాంభావుగారి నభిషిక్తునిఁ జేసిరి. ఈశివరాంభావుగారి కాలమున పూనాపేష్వాల ప్రతాప మడుగంట నారంభించినందునను, రెండవ బాజీరావుగారి రాజకార్యనిపుణత్వశూన్యత వలనను ఈయనవారి నతిక్రమించి స్వతంత్రుఁ డాయెను. కాని యింతలో నాంగ్లేయ ప్రభుత్వ మెల్లెడలను వ్యాపించినందున శివరాంభావుగా రాంగ్లేయులతో సఖ్యము చేసి యనేక సమయములయం దింగ్లీషువారి కనేక విధముల తోడువడెను. శివరాంభావుగారికి కృష్ణారావు, గంగాధర రావులను ముగ్గురుపుత్రు లుండిరి. వారిలోఁ బెద్దవాఁ డగు కృష్ణరావు తండ్రి బ్రతికియున్న కాలముననే మృతిజెందినందున శివరాంభావుగారి యనంతర మాయనకొమారుఁ డగురామచంద్రరావుగారికి రాజ్యాధికారము దొరకెను. ఈయన పరిపాలన