పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/130

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
116
అబలాసచ్చరిత్ర రత్నమాల.

విద్యాభ్యాస మధికమయినకొలఁదిని ఆమెమనసు మాఱెను. ఆమె పరద్వీపమున కేగి యిట్టివిద్యను నేర్చివచ్చినను, గర్వ మామె నంటఁజాలకుండెను. ఆమె చరితము గని వినినవారలు స్త్రీవిద్యాద్వేషు లయినను తమయభిప్రాయమును మాని స్త్రీ విద్యాభిమాను లగుదురనుటకు సందేహము లేదు. ఈమె చరితము అమేరికాలోనివారును వ్రాసి మిగుల పూజ్యభావములతోఁ జదువుచున్నారు.

ఇట్లీయుత్తమసతి దేశదేశాంతరములయందుఁగీర్థిఁగాంచి విద్యచే స్త్రీలు బాగుపడుదురేగాని చెడిపోరనియు దుర్గుణములకు విద్యకు విరోధమేగాని విడలేని మైత్రిలేదనియు, స్వచరిత్రమువలన స్థాపించి, విద్యనేర్చిన స్త్రీలందఱు ధర్మము విడుతురనియు, పతిని మన్నింపరనియు స్వచ్ఛంద లగుదురనియుఁ గొందఱు చెప్పెడిమాటలు ద్వేషజన్యములయిన యసత్యవాక్యము లనియు, స్థిరపఱచినందునను ఆనందీబాయి చరిత్రమునకు నేను "స్త్రీవిద్యావిజయదుందుభి" యని పేరుపెట్టితిని.

Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf