పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

కీర్తిశేషురాలైన శ్రీమతి. బండారు అచ్చమాంబగారు రచించిన అబలా సచ్చరిత్ర రత్నమాలలో కొన్ని చరిత్రములు ఇదివరలో నేను ఎచ్. వి. కృష్ణలో భాగస్థుడుగా నుండగా మొదటి సంపుటముగా ప్రకటించితిని. ఇట నే వర్ణింప నవసరముకాని కొన్ని కారణములచే రెండవ సంపుటము నింతకాలము దనుకను ప్రకటింపజాలనైతిని. ఆంధ్రలోక మీ రెండవ సంపుటమునకై యెదురు చూచుచున్నదని నే నెరుగని వాడనుకాను. కావున నిప్పుడు యుద్ధ సమయమేయైనను గ్రంథములకు వలయు సర్వోపకరణములు మిక్కిలి ధర హెచ్చి యున్నను సాహసించి పనిబూని నేటీ కీగ్రంథమును వెలియిడ గలిగితిని. అవ్యాజభ్రాతృ వాత్సల్యమును నాకిట్టిప్రకటనా స్వాతంత్ర్యము ననుగ్రహించియుండు మాకొమఱ్ఱాజు లక్ష్మణరావు ఎం.ఏ. గారికి హృదయపూర్వక కృతజ్ఞతను తెలియజేయు చున్నాడ. ఇంకను అచ్చమాంబగారు వ్రాసిన చరిత్రములు బాగుగా తెలియని సతీమణుల వృత్తాంతములును వారు రెండవ భాగముగా తలపెట్టి కొంతవరకు సాగించిన పురాణకాలపు స్త్రీల చరిత్రములును ప్రకటితములు కావలసియున్నవి. దీనిని మూడవ సంపుటముగా ప్రకటింపనున్నాను. ఈ రెండవసం