పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

అబలాసచ్చరిత్ర రత్నమాల.

విని రావ్ సాహేబు దాండేకర్ అను నాతనికి మిగుల విచారము కలిగెను. అంత నాతఁ డనేకప్రయత్నములచే నామె యమేరికాప్రయాణ మాపవలెనని యత్నించిచూచెను. కాని యాతని ప్రయత్నములవలన నేమియు ఫలముకాన రాకుండెను. అంత నాపూర్వాచరపరాయణుఁడు ఆనందీబాయి యాప్తులకువ్రాసి వారిచే నమేరికాకుఁ బోవలదని యానందీబాయికి ననేకము లయినయుత్తరములను వ్రాయించెను.. కానివానివలనను ఆమె ప్రయాణమాగదయ్యెను. రేపు ప్రయాణమనఁగ ఆనందీబాయి యక్కవద్దినుండి తమ్మునికి ప్రాణాంతముగా నున్నదనియు నీవుతక్షణము బయలుదేరి రావలసినదనియు నుత్తరమువచ్చెను. దానింగనిఆనందీబాయి కొంచెమాలోచింపఁగా నాయుత్తరము నీప్రయాణము నాపుటకే వ్రాసిరనియు నీతమ్మునికి నిజముగ ప్రాణాంతముగనుండిన నీవుపోయి చూచునంతకునుండఁ డనియు ఇందువలన నీవు చేయఁబోవు మహాకార్యమును మానుట మంచిదికాదనియు నామెమనోదేవత యామెకుఁ జెప్పి యామె నిశ్చయముఁ దొలగకుండఁజేసెను. ఆహా! దృఢనిశ్చయమన నిట్టిదిగదా? చిన్న చిన్న సంకటములు ప్రాప్తించినను భయపడి మనవారలంగీకృతకార్యమును పరిత్యజింతురు. కాని యట్టివారు ఆనందీబాయి చరిత్రఁ జదివి దృఢనిశ్చయ మనుసద్గుణమును నేర్చుకొనియెదరుగాక.

అంత 1883 వ సంవత్సరము ఏప్రియల్ 7 వ తేదిని ఆనందీబాయి కలకత్తానగరమునుండి పాతాళలోకమున కరుఁగ బొగయోడ నెక్కెను. అప్పుడు ఆదంపతుల కిరువురకును గలిగిన వియోగదు:ఖ మిట్టిదనిచెప్ప నెవ్వరితరము ! అయిన