పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
108
అబలాసచ్చరిత్ర రత్నమాల.

యే నామార్గమును బరిశీలించి నన్ను ముందుకునడిపించుకొనిపోవును. దానికంటెను మహోత్తర మయినచేతియూత నాకన్య మేమియుఁ గనఁబడదు.

కొట్టకొనకు నాజాతివా రెవ్వరును జేయనిపని నేనేల చేయవలెను? అనుదానికి నే విన్న వించున దేమనఁగా మన మొక్క రొక్కరము సంఘమునకుఁ జెల్లింపవలసినఋణములు పెక్కులు గలవు. వీరీపనిచేసిన ఋణవిముక్తత కలుగునని వేర్వేరుగ వక్కాణించుట దుస్తరము. ఒక్కకార్యముచే నొక్కరి కెప్పుడు మేలు గలుగఁగలదో యందువలన నందఱికి మేలు కలుగుననియే యెంచవలసినది. సర్వత్రజనులందఱికి శ్రేయస్కర మని చెప్పఁదగినపనిని జేయుటకు మనలో నెల్లవారును ప్రయత్నపడవలసినది. మనుస్మృతియందు "చేయఁదగిన ధర్మమును జేయక యుపేక్షించువారు క్షమియింపబడఁగూడని మహాపాతకులు" అని చెప్పఁబడియున్నది. కావున నాతోడిస్త్రీ లెవ్వరును నిదివఱకు జేయనిపని నేనును జేయఁగూడ దనుట యాశ్చర్యజనకముగా నున్నది. మృతజీవులని ప్రసిద్ధిగాంచిన మనపూర్వుల కిట్టియూహ లెన్నఁడును బుట్టియుండలేదు. ఏదీ నాక్రైస్తవమిత్రులు నే నడుగబోవు నీక్రిందిప్రశ్నమున కేమియుత్తరము నిత్తురో చూచెదము. ఓ నెచ్చెలులారా! మీమతధర్మములను బట్టి యేసుక్రీస్తు మీయందఱికొఱకు తనప్రాణమును బలియొసంగక యుండిన మీకు పాపవిమోచనము గలుగునని తలంతురా? ఆయన యట్లు లోకోపకారమును జేయుచుండఁగా వారికిఁ గలిగిన ఘోరమయినదండనమున కేమయిన నామహాను భావుఁడు జంకెనా? లేదు. ఆయన జంకినట్టు మీరెప్పు