పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
107
డాక్టరు ఆనందీబాయి జోశి

ఇఁక కొందఱు కూపస్థమండూకములవలె నింటి నంటి పెట్టుకొనువారే సుఖభోగులందరు. కాని, వారికి సుఖభోగ మేలాగునఁ గలుగునో తెలియదు. అదికోరినప్పుడనుభవింపఁ దగినట్టు సిద్ధముగా నమర్పఁబడి యున్న పదార్థము కాదుగదా? కొందఱికి నూతనప్రియత్వ మెంత యధికముగా నుండు ననఁగా సౌఖ్యమయినను నెడతెగనిదిగానుండిన దానియందు రుచిలేదని వారప్పుడప్పుడు కష్టములను గోరుచుందురు. విదేశమున కేఁగుట చెడుపనిగాదు. కొన్నియంశములనుబట్టి యొక్కచో నివసించియున్న దానికంటె మేలయినపని యనిచెప్పవచ్చును. దేశాటనమున నాదేశముల యొక్కయు, ప్రజలయొక్కయు స్థితిగతులు బాగుగ మనసునఁబట్టగలవు. అట్టివానిఁ దెలిసికొనుటయందు విముఖులమయి యుండఁగూడదు. అవజ్ఞతను మనము బుద్ధి పూర్వకముగా నవలంబించుట యనునది గొప్పదోషములలో నొకటి. విదేశయాత్రలం గావించుటచే మనకు బుద్ధివికాసమును జ్ఞానాభివృద్ధియుఁ గలుగును. ఎల్లవారును యుక్తమయిన దానిని జేయవలసినదే. ప్రతిమనుష్యుఁడు తనసహజీవులకుఁ జేతనయినంత యుపకారమునకుఁ బ్రత్యుపకారము చేసిఋణవిముక్తతనుబొందవలసినది. పరసీమలో మనకుదిక్కెవ్వరని యడిగెదరా? ఏతద్విషయమయి గోల్డుస్మిత్తను ఇంగ్లీషుకవి చేసిన మహోపదేశము మనము గమనింతము. అది యెద్ది యనఁగా "అంధులబుద్ధి విశేషముననుసరింప నేర్చుకొనుము. ఏలయనఁగా వారెన్నఁడు తమచేతి యూతఁకోలతో భూమినిదడవి తెలిసికొనకుండనడుగు బెట్టరు." ఆతీరున నే నేను సర్వశక్తిసంపన్నుఁడయిన నాపరమపితను నాకూఁతకోలగాఁ జేసికొనియెదను. ఆయన