పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/119

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
105
డాక్టరు ఆనందీబాయి జోశి

డేల, ఆపని యిప్పుడే చేయరాదా? అందుకువారికి సర్వస్వాతంత్ర్యము గలిగియే యున్నది. మామహారాష్ట్ర కుటుంబ మొక్కటియైనను లేని యీ బంగాళాదేశమందలి యీస్థలమున నే నిప్పుడు వాసము చేయుచుంటినిగదా! నే నియ్యెడ నాదేశాచారధర్మముల ననుష్ఠించి ప్రవర్తింపుచుంటినో లేదో యెవ్వ రెఱుఁగుదురు? కాఁబట్టి యెన్నఁడును సంభవింపఁగూడ నట్టియు, సంభవించినప్పుడు మానుషప్రయత్నములకు లోఁబడనట్టియు వానినిగుఱించి చింతింపక యుండుటయే యుత్తమము.

5. నాకేది యయిన నిక్కట్టు తటస్థించిన నే నేమిచేయుదు ననెడి ప్రశ్నకు సదుత్తర మేమన్న : _ కొందఱు మనుష్యులు ప్రపంచములోఁ గనఁబడుదానికంటె నతిభయంకరముగా గ్రంథములలోఁ గనఁబడు దురవస్థలను, దుర్దశలను నుదాహరణముగాఁ జూపి భయము నతిశయింపఁ జేయఁ బ్రయత్నింతురు ; కాని యా యాపద లెంత భయంకరములో యంత యరుదుగా సంభవించునట్టుగ విధింపఁబడి యున్నవి. పురుషులుగాని, స్త్రీలుగాని యెద్దియేని యొకకార్యముచేయఁ బూనినప్పుడు తొలుత మేలెంచెదరుగాని కీడెప్పుడు నెంచరు. ఒకానొకప్పుడు తప్పక కీడులు మూఁడి మగవారినిఁ గాని యాఁడువారినిఁగాని భూమిలోని కడఁగ ద్రొక్కినయెడ నింకప్పుడు వృధాచర్చలతోఁ బనియేమి ? అవి వచ్చినప్పు డనుభవించి తీరవలసినదే. కాని యాయాపదలు రాఁబోవు నప్పు డుండెడిబాధకంటె వాని ననుభవించునపు డుండెడిబాధ యల్పమనుట జగద్విదితమే. ఏవిధముననయినను ఈలోకమున శాశ్వ