పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/118

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
104
అబలాసచ్చరిత్ర రత్నమాల

చాలినంత లేదు. ఈహేతువొక్కటియేకాక యింతకంటెముఖ్యములయినవి యందఱి నొప్పింపదగినవి మఱికొన్నిగలవు. అవి యేమనఁగా నాభర్తగారికి వయోవృద్ధయగు జననియు, పసివాండ్రుగనున్న తోఁబుట్టువులును తమ్ములునుగలరు. వారందఱికి సంరక్షకుఁడు నాభర్తగారే యగుటచేతనాయననాతో గూడవచ్చిరేని, వారుదిక్కుమాలిన వారలయి వారి బ్రతుకు భగ్నమయి, వారుతీరనిదారిద్ర్యబాధలకు లోనగుదురు. నాయొక్కతకొఱకు పెక్కండ్రను మలమల మాడునట్లు చేయుట యెంత యమానుషకృత్యము ! కాఁబట్టి నేనొంటరిగా నేగ నిశ్చయించితిని.

4. నే నిండియాకు (హిందూదేశమునకు) మరలవచ్చినప్పుడు నాకు బహిష్కారము గలుగకయుండునా యనుదానికి సమాధానము : _ అట్టిభయమువలన నేనుచలించెదననితలంతురా? నేనందుకు నావంతయినను వెఱవను. ఇక్కడనేవిధముగా నుంటినొ యక్కడఁగూడ నాతీరుననేయుండనిశ్చయించుకొనియుండఁగా నాకు బహిష్కారమేల కలుగును. నాయాచారవ్యవహారములయందుఁ గాని, ఆహారవిహారములలోఁగాని, వేషభాషలయందు గాని మార్పుగావింప నే నెంతయుఁ దలంపలేదు. హిందూయువతిగ నేపోయి, మరల హిందూమానసతిగ నే వచ్చి యిక్కడ హిందూ సుందరులలోనే గలసియుండ నిశ్చయించితిని. ఇప్పుడును దానికంటె భిన్నము గానుండక నాపూర్వు లెట్లు సామాన్యముగా జీవించిరోనేనునట్లే యుండఁగలదానను. ఇప్పగిది నేను బ్రవర్తించునప్పుడు అస్మద్దేశీయులు నన్ను బహిష్కరింపఁ జూతురేని, అప్పు