పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/117

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
103
డాక్టరు ఆనందీబాయి జోశి

చేరుకొనుటకు నామన సెట్లు త్వరపెట్టెనో దానినూహించి మీరే తెలిసికొనుఁడు.

బొంబాయి నగరవాస్తవ్యుల తీరిట్లుండఁగా, బంగాళీ వారిరీతి యిఁకఁజెప్పుటకే శక్యము గాకున్నది. ఇది యెల్ల కడుశోచనీయము. గాలిపట్టుల కెప్పుడయిన నేను వ్యాయామముకొఱకు పోయినప్పుడు ఇంగ్లీషువారయిన న న్నెప్పుడు కన్నెత్తి యంత నిబ్బరముగాఁ జూడరయిరి. కాని బంగాళావారు తమదంభము నంతను వెల్లడిచేసి హాస్యాస్పదముగావించు కొన నన్నుఁ గని "నీవెవతెవు? నీపేరేమి? నీస్థలమేది? నీవెందుల కేగెదవు?" అని యపరిచితు లడుగఁగూడని ప్రశ్నలనడిగి యాగడ మొనర్చిరి. శ్రీరామపురములో విద్యావంతులని యెన్నికగన్న కొందఱు స్వదేశక్రైస్తవులు నేను వివాహితనో, వితంతువు నోదుర్వర్తన గలదాననో, కులభ్రష్టనో యని శంకింపుచుండిరి. ప్రియులయిన యోసభాజనులారా! యిట్టి యవినయప్రచారములు స్వదేశక్రైస్తవులు చేయఁగూడునా? ఎంతమాత్రము చేయఁగూడదు. వీనిని మీకిట్లు విన్నవించుట మీరిట్టిలోపములను సవరణచేయఁ దివిరెదరనియు, మీలోని కష్టముల నెన్న డెఱుఁగని వారు వీనినెల్ల వినినపిమ్మట నమేరికాదేశమునకు నేను పోవయత్నించుట కేవలము వేడుకకయి గాదని యెంచెదరనియేకాని మరియొకతలంపునఁ గాదు!

3. నేనొంటరిగా నేల విదేశమునకుఁ బోవలెనను మూడవప్రశ్నకుత్తరమేమనఁగా : _ తొలుత నేను నాపెనిమిటియును గలిసి వెళ్ళుటకే యుద్దేశించితిమి. పిదపస్థితిగతులను బట్టి యాతలంపు మానుకొనవలసివచ్చెను. మాయొద్దధనమా