పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
102
అబలాసచ్చరిత్ర రత్నమాల.

కొన్ని సంవత్సరములక్రిందట, నేను బొంబాయినగరమున నుండఁగా పాఠశాలకుఁ బోవుచుంటిని. చేతపుస్తకములం బట్టుకొని నేను బడికిఁ బోవుచుండునపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూచువారును మఱికొందఱుబండ్లెక్కిపోవుచు, నన్నుపరికించువారును, వీధులలో ద్రిమ్మరుచుండ నిఁక కొందఱు పెద్దపెట్టున నవ్వుచు "ఇదేమివింత ! కాళ్ళకు మేజోళ్లను బూట్సులను దొడగికొని పాఠశాల కేగునీగరిత యెవ్వతె ! ఇందుమూలమున కలి యప్పుడే ప్రజలమనసుల నావహించిన జాడలు పొడగట్టుచున్నవి గదా!" యనినాకు వినఁబడునట్టుగా కోలాహలముగాఁ బలుకువారుగనుండిరి.

ఓమానినీమణులారా? అట్టిప్రశ్నలను మి మ్మడిగినప్పుడు మీమన సెట్టిసంతాపమును బొందెడినో మీరేసులభముగా నూహించి తెలిసికొనఁ గలరు.

ఒకప్పుడు నేను కొంతకాలము పాఠశాలలో నుండవలసివచ్చి భోజనము నిమిత్తము దినమునకు రెండుసారులు బంధువులయింటికిఁ బోవలసివచ్చెను. నేనపుడట్లుపోవుచు వచ్చుచున్నప్పుడెల్ల వీధివెంట నేగువారు నాచుట్టును చేరికొందఱు ఎగతాళిచేయ నారంభించిరి. కొందఱు కడుపుబ్బనవ్వఁ జొచ్చిరి. తక్కినగృహస్థులుడాంబికముగా తమతమపంచలలో గూర్చుండి నన్నుఁ గని వికృతాలాపము లాడుచునాపైని రాళ్లు రువ్వుట కెంతయు లజ్జిం పరయిరి. ఇఁక నంగడివాండ్రు, బేరగాండ్రన్ననో నన్ను వెక్కిరింపుచు అసహ్యకర మయినసైఁగలం జేయసాగిరి. అట్టిసమయములో నాస్థితి యెట్లుండెనో యిల్లు