పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/112

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

98

అబలాసచ్చరిత్ర రత్నమాల.

గోపాలరావు, నేఁటివఱకును బ్రాహ్మణస్త్రీ పరదేశమున కరిగి విద్యనభ్యసించిన యుదాహరణ మెందునుగానరాదు. కాన నీవు వెళ్ళి విద్యనభ్యసించి యుదాహరణీయవగుము. స్త్రీలుసామర్థ్యహీన లన్న వాక్యమును నీవబద్ధము చేయుము. మననడవడిని విడువక అమేరికావారికి మన నడవడిని నేర్పుము, ప్రస్తుతము సంస్కరణము కావలయు ననువారు పెక్కెండ్రు పురుషులుకలరు, కాని వారిచేతఁ గొంచమైనను సంస్కరణమగుటలేదు. నీవు స్త్రీవైకొంచెము సంస్కరణము చేసి చూపినను మిగుల నుపయోగకరముగా నుండును.

అందు కానందీబాయి సమ్మతించి యంతదూరదేశ ప్రయాణమునకు సాహసించెను ! ఆమెతన కెట్టికష్టములువచ్చినను వెనుకఁదీయక స్వదేశసోదరీమణుల కొకయుదాహరణము చూపి వారికి మేలుచేయఁ దలఁచెను!!

ఇట్లు వారు కృతనిశ్చయులయి ఆనందీబాయి కొఱకమేరికాలో ననుకూలమగు బట్టలనుకుట్టించి, సిద్ధపఱుచుచుండిరి. ఆనందీబాయి పరదేశపువస్త్రములు ధరియింపనని నిశ్చయించుకొని మనదేశమునందలి ముతక బనాతుగుడ్డలతోనే దుస్తులను కుట్టించుకొనెను. ఇట్టిదిగదా స్వదేశాభిమానము ! ఈమె అమేరికా కరుగునని విని యనేకు లనేకాక్షేపణలు చేసిరి. కాన వారి కందఱకును సమాధానకరముగా ఆనందీబాయి యొకపాఠశాలా మందిరమున సభచేసి గంటసేపు హూణభాషయందు నస్ఖలితముగా నుపన్యసించెను. అందువలననే యామెకు నింగ్లీషునందుఁగల ప్రజ్ఞయు, నామెయొక్క యప్రతిమానక్తృత్వశక్తియు వెల్లడి యగుచున్నవి. ఆ యుప