పుట:Abalaa sachcharitra ratnamaala Dvitiiya Sanputa.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
92
అబలాసచ్చరిత్ర రత్నమాల.

సమానముగా నుండునని తెలిసికొనెను. గోపాలరావుగారికిఁ జిన్న తనముననే ప్రధమవివాహమాయెను. ఆయన తనభార్యకు విశేషవిద్యఁ గఱపి స్త్రీవిద్యవలనిలాభములను ప్రపంచమున కగుపఱచవలెనని దృఢముగా నిశ్చయించుకొనినవాఁడు. అందు వలన నాతఁ డనేకప్రయత్నములచేఁ దనసతికి విద్యనేర్పఁ దొడఁగెను. కాని యాచిన్నది యత్త, యాఁడుబిడ్డల కోడంట్రికముచే నలుగుచుండినందున విశేషవిద్యాభ్యాసముచేయ లేకుండెను. ఇట్లుండగా నాచిన్నదానికిఁ బదుమూడవయేట నొక కొమారుఁడు కలిగి తల్లిని స్వర్గమునకంపెను. ఆచిన్నవానిపేరుకృష్ణా; ఆతఁడిప్పటివరకును సుఖముగానే యున్నాఁడు. ప్రథమభార్యచనిపోయిన పిదప గోపాలరావు నుదాసీనుడయి రెండవవివాహము జేసికొనను అని నిశ్చయించుకొనెను. ప్రధమపత్ని యున్న కాలములోనే యతనికి మొదటపూనాలోనే పోస్టాఫీసులో నొకచిన్న జీతము గలపని దొరకి పిదప స్వతంత్రముగా ఠాణాలోని పోస్టుమాస్టరు పని దొరకెను. ఆయన తనప్రధమపత్నికిఁ గలిగిన కోడంట్రికముంగని చిన్నతనముననే వివాహములుచేసి పిల్లల నతిక్రూరముగాఁ జూచెడియత్తలను మిగుల దూషింపు చుండెను. ఇవన్నియు విచారించి యాయన ద్వితీయ వివాహము చేసికొనుటకు నిష్టము లేనివాఁడయి యుండెను. కాని గణపతిరావు ఆయన వద్దికి వచ్చి తనకొమార్తెను చేసికొనవలసినదని యడుగఁగా నాతఁడు తానొకస్త్రీని పూర్ణవిద్యావతినిఁ జేసి ప్రపంచమునకు నుదాహరణము చూపఁ దలఁచినవాఁడగుటచే, 'నాభార్యకు నే నెట్టివిద్య గఱపినను మీ రడ్డుపడకుండెడియెడలనే