పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తోరూదత్తుకుగల ఇంగ్లీషు ఫ్రెంచు భాషాజ్ఞానము ఈమెకంటె నధిక వయస్కు రాండ్రగు ఇంగ్లీషుఫ్రెంచు స్త్రీలలోనే కానవచ్చుటయే దుర్లభము. ఈ రెండుభాషలును తోరూదత్తుకు బరభాషలేయైనను వానియందామె స్వభాషవలెనే కవిత్వము చేయుట గని లోకు లాశ్చర్యపడుచుండిరి. ఈమె కవిత్వములో విశేషభాగము భాషాంతరీభూతమైనను, అందు కవిత్వమునకు గావలసినలక్షణములన్నియు ననగా శబ్దశౌష్ఠవము, అర్థగాంభీర్యము, రసపుష్టి మొదలైన గుణము లున్నందున జదువరుల కామె కావ్యములు భాషాంతరీకృతములుగా దోచక స్వతంత్రరచనగానే తోచుచుండెను. తోరూదత్తు 'ప్రాచీన హిందూస్థానములోని పాటలు' అను కావ్యమొకటి రచించెను. ఆకావ్యమునకు ప్రొ. గ్యాస్‌దొరగారొక పీఠికవ్రాసిరి. అందు నాతడు "పందొమ్మిదవ శతాబ్దములోని కవులచరిత్రమును వ్రాయునప్పుడు తోరూదత్తుచరిత్రమును వ్రాయవలసి యుండును" అని వ్రాసియున్నాడు ఆంగ్లేయునిచే నిట్టిస్తుతివడసిన నా నారీరత్నమును స్తుతించుటకు నేనెంతదానను.

ప్రథమగ్రంథ మచ్చుపడిన కొద్దిదినములకే తోరూబాయికి వ్యాధి సంభవించెను. అందువలన నామె, తండ్రిబలముచే సంస్కృతాధ్యయనమును మహాకష్టముతో వదలివేసెను. రోగము నడుమనడుమతగ్గినట్లు కనబడుచుండినను దినదిన మామెసత్తువ తగ్గుచుండెను. ఆమెకుబలముక్షయించిన కొలదిన కవిత్వథోరణి యధికమయ్యెను. తానీ ప్రపంచమునందుండుట కొద్దిదినములవరకే యనితోచిన కొలదిని కావ్యములు వ్రాసియజరామ రణ కీర్తిని సంపాదించవలయునను ఇచ్ఛయామె కెక్కువగా