పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇంగ్లాండునకు వెళ్ళిరి. 1873 వ సంవత్సరమువరకు వారచట నుండిరి. వారాకాలమునందును వ్యర్థముగా గాలము గడపక యింగ్లీషు, ఫ్రెంచుభాషలయందసాధారణ ప్రవీణత సంపాదించిరి. వారు కేంబ్రిడ్‌జ్ పట్టణము (మనకాశీ పట్టణము వలెనీగ్రామ మింగ్లండునందు నొకగొప్పవిద్యాపీఠము) నందుండి బ్రేగ్నిల్‌దొరసానిగారు ఫ్రెంచుభాషయందు నిచ్చిన యుపన్యాసములకు దప్పకపోవుచుండిరి. తదనంతరమందు వారిరువురును సెంటులియో నార్డ్సు పట్టణమునందు తమఫ్రెంచు విద్యనువృద్ధిపరచిరి. యూరపుఖండమునందున్న కాలమున తోరుదత్తు తననిత్యప్రవర్తన నిత్యము వ్రాయదొడగెను. ఆపుస్తకమునందు ననేక సంగతు లామె మిగులశ్రద్ధతో వ్రాయుచుండెను. నిత్యము జరిగినసంగతు లాపుస్తకమునందు నత్యంతశ్రద్ధతో నతివివరముగా వ్రాయబడినవి. అందు నామె యనేక సంగతులను గురించి తనసొంత యభిప్రాయము వ్రాసియున్నది. ఆ యభిప్రాయము లెంతయో రమ్యముగా నున్నవట.

ఈ చిన్నకుటుంబము ఫ్రాన్సుదేశముకంటె నింగ్లీషుదేశముననే విశేషదినములుండుట తటస్థించినను, తోరుదత్తుకు ఫ్రాన్సుదేశమునందే విశేష గౌరవముకలిగియుండెను. జన్మభూమియయిన హిందూదేశముపై నామె కెంతప్రీతి యుండెనో, యంతప్రీతి ఫ్రాన్సుదేశముమీద నుండేను. 1869 వ సంవత్సరమున ఫ్రాన్సుదేశమునకును, జర్మనీదేశమునకును జరిగిన ఘోర రణమునందు ఫ్రాన్సునకు బరాభవము కలిగినప్పుడు చూడనొపక తోరుదత్తు తననిత్యప్రవర్తన గ్రంథమునందు నిట్లు