పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉపోద్ఘాతము

అబలాసచ్చరిత్ర రత్నమాల అనుపేరిట ఉదాత్తములైన స్త్రీలచరిత్రములు వ్రాయదలచినాను. ఈ చరిత్రములు వ్రాయుటయందు నాముఖ్యోద్దేశము లే వనగా:-

(1) స్త్రీలు అబల లనియు, బుద్ధిహీన లనియు, వివేక శూన్య లనియు, సకల దుర్గుణములకు నివాసస్థల మనియు గొందరు నిందింతురు. స్త్రీలపయిన మోపబడిన యీ దోషారోపణము లన్నియు నబద్ధము లనియు, స్త్రీలలో నత్యంత శౌర్య ధైర్యవతులును, అసామాన్యవిద్యావిభూషితలును, జ్ఞానవతులును, రాజ్యకార్యధురంతరత్వము గలవారును, స్వదేశాభి మానినులును, సకలసద్గుణవిభూషితలును, బూర్వముండిరనియు నిప్పు డున్నవా రనియు స్థాపించుట నామొదటి యుద్దేశము. ఇంతియకాదు. స్త్రీలయొక్క స్వాభావిక ప్రవృత్తి సద్గుణముల వైపున కేకాని దుర్గుణముల వైపునకు గాదనియు, సిద్ధాంతీకరించుట నాప్రథమోద్దేశములలోని యుద్దేశమే.

(2) స్త్రీలకు విద్య నేర్పినయెడలను, వారికి స్వాతంత్ర్య మొసగినయెడలను, వారు చెడిపోవుదురనియు, బతుల నవమానించెద రనియు, గుటుంబసౌఖ్యమును నాశము చేసెద రనియు,