పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్రాసియున్నాడు. ఈ జాన్ మిల్టనుకవి యింగ్లీషుకవులలో బహుగొప్పవాడట. ఆయనగ్రంథములు ప్రధమ శాస్త్రపరీక్షకును, బట్ట పరీక్షకును, మరియితరమైన గొప్పగొప్పపరీక్షలకును, బఠనీయ గ్రంథములుగా నుంచెదరట. గొప్పగొప్పవిద్యార్థులకును ఈయన గ్రంథములలోని యర్థము తెలియుట కష్టమట. వానిలోని యంతరార్థము తెలియుట యంతకంటె దుర్లభ మట. సంస్కృతములోని మాఘ, నైషధ కావ్యములయొక్కయు, ఆంధ్రములోని వసుచరిత్రముయొక్కయు బాకముమీదనే ఈ కవి యొక్క కావ్యములును దిగినవట. ఇట్లయ్యును ఈకవియొక్క కావ్యములలోని రహస్యములు చిన్నతనమునందే కనిపెట్టిన తరులతా దత్తుయొక్క బుద్ధివైభవమును దైవికమనియే చెప్పవలసియున్నది.

1869 వ సంవత్సరమునందు బుత్రమరణదు:ఖితుడగు గోవిందచంద్రదత్తుగారు, కన్యలే తమకు బుత్రులని యెంచి వారివిద్యాభివృద్థికయి, వారిని నైరోపాఖండమునకు గొనిపోయెను. వారికి ఉన్నతవిద్య నేర్పదలచి, ప్రథమమునందాయన ఫ్రాన్సుదేశమునకు బోయి 'నీసు' నగరమునందు వసించెను. అచట నాసోదరీమణులిరువురును తమబుద్ధిబలిమిచే విద్యార్థివేతనముల సంపాదించుకొనుచు, ఫ్రెంచువిద్వాంసుల ఆశ్రయించి ఫ్రెంచుభాష నేర్చుకొనిరి. కొన్నిరోజులు వీరు ఫ్రాన్సుదేశమునకు రాజధానియయిన పారీసునగరములో నుండిరి. అచ్చట ఫ్రెంచువిద్య చక్కగా నేర్చుకొని యా మువ్వురును ఇటాలిదేశము జూచి లలితకళా విద్యలకు బుట్టినిల్లయిన