పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిచ్చెను. అందు నందరకంటెను చిన్నకూతురగు తరులత కలకత్తాలో 1856 వ సంవత్సరమునందు జన్మించెను. ఈమె బాల్యమంతయు నా నగరములో గడిచెనని చెప్పవచ్చును. తరులత యందరకన్న కడసారి కూతురగుటచే నామెను అందరును "తోరు" అను ముద్దుపేరు పెట్టి పిలుచుచుండిరి.

తోరూదత్తు తండ్రి స్త్రీవిద్యాభిమాని యయినందున నితరబంగాలీస్త్రీలకు విద్యార్జనమునందు గలుగు నిబ్బందు లేమియు లేక విద్య నభ్యసించుటకు నితర బాలికలకు నలభ్యము లైన సాధనములెన్నియో ఈమెకు బాల్యమునుండి లభించెను. ఈమెతండ్రి యత్యుత్సాహముతో నీమెకును, పెద్దకూతురగు ఆరూబాయికిని విద్యగరిపెను. పిదపి కుమారుడగు ఆబాజితో నీ యాడుబిడ్డలకును ఇంగ్లీషు నేర్పుటకు బాబు శివచంద్రబనర్జీ గారిని గురువుగా నియమించిరి. గురువగు బనర్జీ తోరుయొక్క బుద్ధికుశలత గనిపెట్టి విశేషశ్రద్ధతో నేర్ప నామె ఇంగ్లీషువిద్య యందు నధిక ప్రీతి గలిగినదై బహు శీఘ్రముగా విద్యార్జనము చేయుచుండెను. ఇట్లు విద్యార్జనముజేయ గొలదికాలములోనే యామెకును ఆమె యక్కకును ఇంగ్లీషుభాషలోని మహా కావ్యములయొక్క యర్థము స్వయముగా గ్రహించునంతశక్తి గలిగెను. "ఘనతవహించిన మిల్టను కవివరుని గ్రంథముల నీ అక్కచెల్లెండ్రు పఠనగ్రంథముగా గైకొని, తమతో సమమైన సంయీడుగల యాంగ్లేయ బాలికలకంటె నెక్కుడుగా నర్థమును గ్రహింపగలిగి, కవితాప్రవాహాదులను జూచి యత్యద్భుతము బొందుచు వచ్చిరి." అనియొక చరిత్రకారుడు వీరినిగురించి