పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యవధి యుండెను. బేగముగారి మనమున నంత్యకాలమువరకు దాము రాజ్యము చయవలయు నన్న యిచ్ఛయుండెను. బేగముగారియిచ్ఛ త్వరలోనే సిద్ధించెను.

1857 వ సంవత్సరమున ఉత్తర హిందూస్థానము నందలి పటాలములోని సిపాయిలు తిరుగబడినందున ఇంగ్లీషు వారికి గొప్ప సంకటము సంబవించెనని, హిందూదేశ చరిత్రము చదివినవారి కందరికిని తెలిసినవిషయమే. ఆ సంకటసమయమున, దయార్గ్రహృదయ యగు బేగమువారు ఇంగ్లీషువారి కనేకరీతుల సహాయము జేసి, ఇంగ్లీషువారు సూర్యచంద్రాదులుండువరకు మరవగూడని యంత యుపకారము జేసినది. సంకట సమయమున నింగ్లీషువారికి నుత్తర హిందూస్థానము నందు శిందోహోళకరులును, మధ్యహిందూస్థానమునందు భూపాళబేగముగారును, దక్షిణమున నైజామును, సహాయము జేసి నందువలననే యీ దేశమునం దాంగ్లేయులుండ గలిగిరేమో. అనగా మనమిపుడింగ్లీషురాజ్యమువలన ననుభవించుచున్న శాంతత, నాగరికత, విద్యాభివృద్ధి మొదలగు సౌఖ్యములకు అంశత: శికందరుబేగముగారు కారణ భూతురాలని నిర్భయముగా జెప్పవచ్చును. ఈమె రాజ్యములోని యనేక జనులును, సొంతముగా నీమె తల్లియు,, నింగ్లీషువారిపై దిరుగబడిరి; కాని యీమె వారందరిని నివారించి, మృత్యు ముఖమున బడనున్న యనేకాంగ్లేయుల యుక్తి ప్రయుక్తులతో నింగ్లీషు సైన్యముండిన హుషంగాబాదు పట్టణమునకు సురక్షితముగా జేర్చుటయందు బేగముగారు చూపిన థైర్యమత్యంత