పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొమార్తెకు ద్వరగా వివాహము చేయకపోయెను. త్వరగా వివాహ మైనయెడల దనకు రాజ్యము రాగలదని, మునీరమహమ్మదుఖాను వివాహోత్సకుడై, తనకు వివాహము త్వరగా జేయుమని యతడు కుదషియాబేగమును పోరసాగెను. ఇందుచే వీరిద్దరికి వైరము సంప్రాప్తమాయెను. కాని రాజ్యములోని సామంతులు, ఉద్యోగస్థులు మొదలయిన వారందరును కుదషియాబేగము పక్షమువారయినందువలన, పూర్వము చేసిన నిబంధనను కొట్టివేసి, మునీరుఖానుకు 40,000 రూపాయలిచ్చి, వారి తగవుతీర్చి, కుదషియాబేగమే రాజ్యము చేయవచ్చునని నిర్ణయించిరి. మునీరుఖానుకును శికందరు బేగముకును వివాహము చేయవలయునన్న యేర్పాటు మీరిన తరువాత, జహంగీరనువానితో శికందరుబేగముగారి వివాహము జేయవలయునని నిర్ణయించిరి. ఈ జహంగీరుకూడ శికందరుబేగముయొక్క పెదతండ్రి కుమారుడే, ఇచ్చట హిందూ చదువరులు మహమ్మదీయులలో గల యొక రూడిని జ్ఞాపక ముంచుకొనవలయును. మనలో మేనమామకూతురును వివాహమాడుట సశాస్త్రీయ మైనట్లు; తురకలలో బినతండ్రి పెదతండ్రుల కొమర్తెలతో బెండ్లియాడుట సశాస్త్రీయము. ఇదిమనకు వింతగా గానుపించునుగాని, తురకలలో సామాన్యమైన రూడియే.

కుదషియాబేగము సంపూర్ణముగా రాజ్యలోభగ్రస్తయైనందువలన దనబిడ్డను జహంగీరునకు కిచ్చి వివాహము చేసెదనని కాలము గడుపుచుండెనేగాని, త్వరగా వివాహము