పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దనుగ్రహముగలవాడై, బాదుషాగారితో జెప్పి, ఇతనిని భైరసియా ప్రాంతమునకు సుబేదారుగా నేర్పరచెను. అచ్చటనుండు కాలములో దన చాతుర్యమువలన దాను సుబేదారుగా నున్న ప్రాంతమంతయు దనచేతికి దెచ్చుకొని, ఔరంగజేబు మరణానంతర మాతడు స్వతంత్రరాజై, భూపాళు అను పట్టణమును తన రాజధానిగా నేర్పరచుకొనెను. కనుక బేగముగారి వంశమున కీతడు మూలపురుషుడని చెప్పవచ్చును.

దోస్తమహమ్మదుఖాన్ 1723 వ సంవత్సరమున మృతుడయ్యెను. ఇతని మరణానంతరము భూపాళరాజ్యమును గురించి యనేక కలహములు జరిగెను. కానితుదకు సుల్తానుమహమ్మదు యారమహమ్మదు, యాషీనమహమ్మదు, హయాతుమహమ్మదులు క్రమముగా రాజ్యారూడులైరి. వీరిలో నాఖరువాడగు నవాబు హయాతుమహమ్మదు 29 సంవత్సరములు రాజ్యము చేసెను. ఇతని రాజ్యములోనే మరాఠావారితో ననేక ఘోర యుద్ధములు జరిగినవి. ఇతడు కాలముచేసిన తదనంతర మతని కుమారుడగు గోసమహమ్మదు రాజ్యస్థుడాయెను. ఈ గోసు మహమ్మదు పేరుకు రాజుగా నుండినను నితని పినతండ్రి కుమారుడగు వజీరుమహమ్మదు రాజ్యమును జరుపుచుండెను. ఈవజీరు మహమ్మదు ధైర్యస్థైర్యములుగల పురుషుడుగావున, నాభూపాళ దేశముపై వచ్చిన సంకటముల నన్నిటిని నివారించి, దండెత్తి వచ్చిన పరరాజుల నోడించి రాజ్యమును రక్షించెను. ఈవజీరు మహమ్మదు 1816 వ సంవత్సరమున గతించెను. అనంతర