పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దరు." ఈ మాటలువిని రాజు మిక్కిలి ఖిన్నవదనుడై యింటికి బోయెను. రాజు ఖిన్నవదనుడగుటకు గారణమేమి యని, జగదేవుదు 'విచారించి' యా సంగతిని దెలిసికొని, చిన్న పోవలదనియు, లోకులకొరకును, రాజుగారికొరకును దాను సంతోషముతో బలిపోయెద ననియును, రాజుగారితో జెప్పెను. రాజు వలదని చెప్పెనుగాని, యామాటలువినక జగదేవుడింటికి బోయి భార్యతో నా మాటలు చెప్పగా నామె తానును, దనకుమారుడును బలివచ్చెదమని చెప్పెను. ఇట్లు లోకహితార్థమై యాత్మ దేహములను సమర్పింప నిశ్చయించి, యా దంపతులు తమ సొత్తంతయు బీదలకు బంచిపెట్టి, యభ్యంగనస్నానము లాచరించి, ప్రాత:కాలమున మంగళవాద్యములతో దేవికడకు బోయిరి. దేవికిబూజచేసి, మొదట పిల్లవానిని, పిదప వీరమతిని తరువాత జగదేవుని బలియియ్య దలంచిరి. ఇట్లు ఆ దంపతులు కృతనిశ్చయులైయున్న సమయమున రాజుగారికి నా సమాచారము తెలిసి, వారిని వారించుటకై యతడు దేవిగుడికి వచ్చెను. వచ్చి జగదేవుని వలదని రాజు వారించుచుండగా నా దుష్టులలో నొకడు మరల దేవి వెనుకకుబోయి దేవివలెనే యిట్లనియె - "రాజా! వలదని యతని నివారింపకుము. ఈ బలివలన నీకు జాల లాభము గలుగును," ఈ మాటలు వినగానే రాజుగారికి సంశయము గలిగి, దేవి వెనుక వెదకిచూడగా నా దుష్టుల కృత్రిమము తెలిసెను, ఇదేకథ కొందరిట్లు చెప్పుదురు. జగదేవుడును అతని భార్యాపుత్రులును కాళికాదేవి వద్దకుబోయి స్వదేహములను స్వహస్తములతో బలి యిచ్చికొనిరట. వీరందరు మృతు