పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తన పరిచారికలలో నొక దానిని, 'మీకొరకు మీమేనయత్త కని పెట్టుకొని కూర్చున్నది, అని చెప్పిజగదేవుని దీసికొనిరమ్మని పంపెను' ఆదాసి పోయినటుల నటించి, తిరిగివచ్చి, రాజుగారితో జగదేవుడు భోజనము చేసినాడు; మిమ్మును, వీరమతి గారిని భోజనము చేయమని చెప్పినాడు అనిచెప్పెను. అందు పయి వీరమతి కొంచెము భుజించెను. తరువాత నా వారయువతి యొక సుందరమైన యరచూపి వీరమతిని అచ్చట విశ్రముంచుమని చెప్పివెళ్ళెను. ఈసంగతులన్నియు జూచి వీరమతికి సంశయము కలిగెనుగాని, సాయంకాలమువరకు బెనిమిటి వచ్చునేమోయన్న యాశచే నామె యాగదిలో శయనించెను. సాయంకాలము కాగానే యింటి యజమానురాలు మరల వచ్చి భోజనమునకు రమ్మని పిలిచెనుగాని, భర్త వచ్చి భోజనము చేయనిది తాను అన్నము ముట్టుట లేదని వీరమతి తననిశ్చయము తెలిపెను. అప్పుడు జామోతి యేమియు జేయలేక కొన్ని ఫలాహారము లచ్చట బెట్టి తినుమని చెప్పి వెళ్ళిపోయెను. పోవుచు జామోతి గదియొక్క వెలుపలి గొళ్ళెమును వేసికొనెను. అదియంతయు జూచి ఇదియొక మాయగానున్నదని తలచి వీరమతి మరింత భీతి నొందెను. ఆమె యాగదిలో గూరుచుండి పెనిమిటిని నెప్పుడు చూచెదనా యని చింతించుచుండెను.

ఆ పట్టణములోని దండనాయకుని కుమారుడగు లాలుదాసునకు బ్రతిదినమున నొకక్రొత్త యువతిని సమర్పించుట జామోతియొక్క నిత్యవ్రతము. ఆరోజు వీరమతివంటి చక్కని స్త్రీ దొరకి నందుకు జామోతి యెంతయు సంతసించి, తనకు