పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుని కుమారుడగు లాలదాసనువాడుగూడజారశిరోమణి యని పేరుగాంచి యీ జామోతికి దాసుడయి యొప్పుచుండెను.

పైని చెరువునకు నీళ్ళకొరకువచ్చి వీరమతి నామ గ్రామములు కనుగొనినదని చెప్పిన వనిత ఈ జామోతియొక్క సేవకురాలు. దాసి చెప్పినమాటలు విన్నతోడనే యా వేశ్యాంగన రాజస్త్రీకి యోగ్యమయినవేషము వేసికొని, మేనాయెక్కి వెంట గొందరు భటులను దీసికొని వీరమతి యున్నచోటికి వెళ్ళెను. అచ్చట నామెనుగాంచి ఎవరో కావలసిదానివలె నామెవద్దకి వచ్చి, "పరాయివారివలె మీరిట్లు వేరుబస చూచుకొనుట న్యాయమా? మీరువచ్చెదరని మొదలే కబురుచేసినపక్షమున మేము మీ కెదురుగనే వచ్చియుందుము. నేను ఉదయాదిత్యుని పినతండ్రి కూతురను; జగదేవునికి వేలువిడచిన మేనయత్తను. బసచూచుటకయి జగదేవుడు పట్టణములోనికి రాగా రాజుగారతనినిజూచి యానవాలుపట్టి రాజమందిరములోనికి దోడుకొని వచ్చిరి. అచ్చట నతనిచే నీవిచ్చటనున్న సంగతి విని నిన్ను రాజ భవనమునకు దీసికొని పోవచ్చితిని. ఈ గుర్రములు మొదలైన వానిని నాబంట్లు దీసుకొనిరాగలరు. ఈ మేనాలో గూరుచుండుము. పద, పోయెదము" అని పలికెను. ఆమాటలువిని యామె చెప్పిన సంగతులన్నియు నిజమనుకొని వీరమతి యామె వెంబడి రాజగృహమునకు సరితూగుచున్న యామె గృహమునకు బోయెను. అచ్చటికి వెళ్ళినపిదప నా వేశ్యాంగన వీరమతికి నభ్యంగన స్నానముచేయించి, కొంతసేపటికి భోజనమునకు లెమ్మని పిలిచెను. అందుపైని మీమేనయల్లుడు భోజనముచేసినగాని నేను భోజనముచేయనని యామె యుత్తరమిచ్చెను. అందుపై జామోతి