పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగదేవుడు గ్రామములోనికి వెళ్ళిన కొంతసేపటికి చెరువున కొకవనిత నీళ్ళకువచ్చి వీరమతిని జూచి నేర్పుగా నామెపేరు, ఆమెపెనిమిటిపేరు, మామపేరు కనుగొనిపోయి ఆసంగతులన్నియు దన యజమానురాలితో జెప్పెను. ఆ కాలమున నా పట్టణము పండ్రెండుక్రోశముల వైశాల్యముగలది యయి బహు రమ్యముగనుండెనట. జయసింగు సిదరాజసురా" బ్రజా పరిపాలనము చేయుచుండెను. ఆయన ధర్మాత్ముడనియు, దయాశాలి యనియు బ్రసిద్థికెక్కెను కాని, అతడు రాజ్యములోని యధికారుల బరీక్షింపక వారిపయి నమ్మకగలిగి ప్రవర్తించుటచే నా పట్టణమందు ననేకాన్యాయములు జరుగుచుండెను. ఆ పట్టణమునకు గొత్వాలనగా, దండనాయకుడుగా నున్న డుంగరసీయనువాడు స్వయముగా నన్యాయములు చేయించుచుండెను. స్వయముగా దొంగలను బ్రోత్సాహపరచి వారు తెచ్చిన సొమ్ములో భాగము గొనుచుండెను. వేశ్యాంగనాసక్తుడయి గ్రామమునందనేక వేశ్యాంగనలను దెచ్చియుంచెను. వారిలో జామొతీయను వేశ్యాంగన మిక్కిలి చక్కనిదియై లెక్కింపరాని ధనమును సంపాదించెను. దానియిల్లు రాజభవనమువలెను పూదోటలు రాజోద్యానములవలెను గానుపించును. ఈ వేశ్యాంగనలలోని రాణి తన దేహమును విక్రయించుటయే గాక పట్టణములోని యనేకసాధ్వీమణులను మోసపుచ్చి తన యింటికి రప్పించి, బలవంతముగా వారిని కామిజనుల కర్పించి వారి ప్రాతివ్రత్యమును భంగము చేయుచుండును. దండనాయ