పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుదర నిర్వాహకమునకు రెండుగ్రామముల నిప్పించి వాసము చేయుటకయి యూరిబైట నొక గృహమునిప్పించిరి. సోళంకిరాణి విచారశీల గావున, సంప్రాప్తమయిన దుస్సితియందుగూడ తన కుమారునకు విద్యాబుద్ధులు చెప్పించుటకు మరచినది కాదు. ఇతర వ్యయము లన్నియు దగ్గించి, మిగిలిన ధనముతో గుమారునకు రాజయోగ్యమైన విద్యలన్నియు జెప్పించెను. ఇట్లు జగదేవుడు కొన్ని దినములలో రణధవలునికంటె నధిక శూరుడని విఖ్యాతిని జెందెను. ఇందుచే రాజ్యమునందలి లోకులందరును జగదేవునియందే బద్ధానురాగులయి యుండిరి. రాజుగూడ జగదేవుని శౌర్యసాహసముల విని సంతోషించుచుండెను. కాని వాఘేలి రాణికి గోపము వచ్చునేమోయని రాజు తనకు జగదేవుని యందుగల ప్రేమ స్పష్టపరచుటకు వెరచుచుండెను. ఇట్లు కొంతకాలము జరిగినవెనుక బైని వర్ణింపబడిన బిరజ రాజుగా రంపిన శుభ లేఖను దీసికొని కొందరు బ్రాహ్మణు లుదాయాదిత్యుని సభకు వచ్చిరి. ఆ శుభపత్రికలను జూచి, రాజు ఆనందభరితుడాయెను. గాని, రణధవలుని వివాహము కానందున వాఘేలి రాణి జగదేవుని వివాహమున కనుజ్ఞ ఇచ్చునో, లేదోయని సంశయించెను. కాని, జగదేవుని యదృష్టము వలన రాజుగారు వాఘేలిని త్వరలోనే సమాధాన పరుపగలిగిరి.

ఇట్లు పెద్దభార్య యనుజ్ఞ పుచ్చుకొని ఉదయాదిత్యుడు టుకుటేడా గ్రామమునకు దరలి వెళ్ళి, కుమారుడగు జగదేవునకు వివాహము జేసి కోడలగు వీరమతిని వెంబడిదీసికొని, ధారానగరమునకు వచ్చెను. జగదేవుని వివాహమయినప్పటి