పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక సమయమునందీమె రామేశ్వర యాత్రకుం బోవు చుండెను. అప్పుడుత్రోవలో శ్రీరంగపట్టణమున పండితులకు జీవబ్రహ్మల విషయమున నొక గొప్పవాదము సంభవించెను. సులీబా యచటి కరిగి తన విచారములను జెప్పి వారిని మెప్పించెను. వారామె పాందిత్యమున కచ్చెరువంది యామెకు 'పండిత' యనిన బిరుదునిచ్చిరి. నాటినుండియు నామె సులీబా పండిత యనంబరగె. తదనంతర మామెయాత్ర గావించుకొని తన గ్రామమునకు వచ్చి స్త్రీలకు నీతి నేర్పుచుండెను. ఇటుల నామె బహుదినములు పతితో సుఖముల ననుభవించి పతి మరణసమయమున నతనితో ననుగమనము చేసెను.


_______