పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డానియల్‌ను క్రీ.శ. 1599 వ సంవత్సరమున అహమ్మద్ నగరము పైకి యుద్ధమున కంపెను.

ఈ సమయమునందు నిజామ్‌శాహీలో మిగుల నవ్యవస్థగా నుండెను. చాందబీబీ వంటి చాతుర్యవతి రాజ్యము చేయుచున్నను ఆసమయమునం దామెకు నచట విశ్వాసార్హులగువా రెవ్వరును లేకయుండిరి. కాన నామె ఏమియు జేయలేక యుండెను. నేహంగఖాను చాందబీబీతో నేమో యాలోచించి వైరులను త్రోవలో నాటంక బరుపబోయెను. కాని శత్రువులాత డుండుత్రోవనురాక మరియొక త్రోవను వచ్చి పట్టణమును ముట్టడించిరి. అప్పుడు చాందబీబీ తనయాజ్ఞను వినువా రెవ్వరును లేక నప్పటికి రాజధానిని విడిచి బాలరాజునుకొని జున్నురను గ్రామమునకు బోవనిశ్చయించెను. కాని యామె సమీపముననుండు హమీద్‌ఖానను వానికా యాలోచన సరిపడక చాందబీబీ పగవారికి రాజ్య మిచ్చుచున్నదని యూరంతను సాట మొదలుపెట్టెను. అది విని దక్షిణతురకలు నిజమని తలచి హామీద్‌ఖానును ముందిడుకొని కొందరు భటులు చాందబీబీ యంత:పురముజొచ్చి యామెను జంపిరి. ఇట్లు హిందూస్థానపు ఇతిహాసములో బ్రసిద్ధురాలయిన స్త్రీరత్నముయొక్క చరితము ముగిసెను. ఈమె ప్రధమమునందు విజాపురమున మరది కొమారుడగు ఇబ్రహీమ్‌ఆదిల్‌షహా చిన్నతనమున నతనికొరకు ఆదిల్‌శాహిని రక్షించెను. పిమ్మట అహమ్మద్‌నగరమున తనతమ్ముని మనుమడగు బహుదురుకొరకు నిజామ్‌శాహీ సంరక్షణమును మిగుల కుశలతతో జేసిసార్వ