పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యమునందలి యామె శౌర్యమునుగని శత్రుసైనికులు సహిత మాశ్చర్యపడిరని ప్రత్యక్షముగా జూచిన యతడే వర్ణించెను. అప్పుడు మురాద్ తనకు గెలుపు దొరకుట దుస్తరమని తెలిసికొని "మాకు వర్హాడప్రాంతము నిచ్చిన యెడల మేము మా దేశమునకు బోయెదమ" ని చాందబీబీకి వర్తమానమంపెను. త్వరగా రాజ్యమునందలి యితర సైనికులు వచ్చితనకు దోడుపడు లక్షణము లేమియు నగుపడనందున వర్హాడ ప్రాంతము చాందబీబీ వారికి నిచ్చి సంధి చేసుకొనెను.

తదనంతరమునం దామె బహాదుర్‌ను కారాగృహము నుండి విడిపించితెచ్చి యతనికి పట్టాభిషేకము గావించెను. అంత నామె అహమ్మదఖానను నాతని ప్రధానిగా నేర్పరచి యా పిల్లవానిపేర తాను రాజ్యము నేలుచుండెను. కాని అహమ్మద్ ఖానునకు రాజ్యకాంక్ష మిక్కుటమైనందున అతడు చాందబీబీమాటను సాగనియ్యకుండెను. ఈ సంగతి సైనికులకు దెలియగా వారాతనిబట్టి బంధించి చాందబీబీ స్వాధీనముచేసిరి. తదనంతర మాతనిపని నేహంగఖానను నాతని కిచ్చినందున చాందబీబీ రాజ్యము సురక్షితముగా నేలదొడగెను. కాని త్వరలోనే నేహంగఖాను రాణికి వైరియయ్యెను. ఈ సమయముననే మురాద్ శహాపురమునందు కాలము చేసెను. అంత నగ్బరుపాదుషా తన చిన్న కొమారుడగు డానియల్ అను నాతనిని మురాద్ పనిమీదికి బంపి యతనికి వజీరుగాఖాన్‌ఖానను వానిని బంపెను. అప్పు డక్బరు బర్హాణ పురమునకు వచ్చి