పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆదిల్‌షహా, కుతుబ్‌షహాలు మురాదునిరాక విని ప్రథమమునందు నిజామ్‌శాహీని గెలిచి పిదప మనపైకి వచ్చునని భయపడి విపులసైన్యములతో నిజామ్‌శాహీకి దోడుగా వచ్చుచుండిరి. ఈ సంగతివిని మురాద్ వారు వచ్చినచో గెలుపొందుట కష్టమని తలచి గ్రామమును చుట్టుముట్టి బురుజులను పడగొట్టి యత్నింపుచుండెను. మురాద్ సైనికులు బురుజులను బైటినుండి త్రవ్వి గూడుచేసి యాగూటిలో తుపాకిమందునుంచి దానికి నగ్నిని రవులుకొల్పి యత్నింపుచుండిరి. కాన చాతుర్య వతియగు చాందబీబీ లోపలినుండి బైటివరకు రంధ్రములు పొడిపించి వారాగూటిలోనుంచు మందు నీవలికి దీయింపు చుండెను. ఇంతలో వారొక బురుజునకు నిప్పంటించినందున నా బురుజుతో గూడ ననేక సైనికులు నాశనమునొందిరి. అంత నా త్రోవను మొగలులు పట్టణములోనికి జొరనుంకించగా నదివర కధిక శౌర్యముతో యుద్ధము చేయుచున్న నిజాము సైన్యములు ధైర్యమువిడిచి పారదొడగెను. అప్పుడు చాందబీబీ ధైర్య మవలంబించి, కవచమునుధరియుంచి మోముపై ముసుగు వేసికొని చేత ఖడ్గమును ధరియించి "నాబొందిలో ప్రాణములుండగా పట్టణము పగవారిచే జిక్కనియ్యన"ని గూలిన బురుజు వైపునకు బరుగెత్తెను. దానింగని సైనికు లధిక శౌర్య సాహసములు గలవారై మరలి శత్రువులతో బోరసాగిరి. ఆ దినమంతయు యుద్ధము జరిగెనుగాని చాందబీబీ శత్రువులను పట్టణములోనికి జొరనియ్యకుండెను. అప్పుడామె యెక్కడ జూచినను దానయై బహుశౌర్యముతో బొరాడెను. ఆ సమ