పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాందబీబీ

ఈ శూరవనితకు నిజామ్‌శాహిలో మూడవపురుషుడగు హుసేన్ నిజామ్‌శహ తండ్రి. ఆదిల్‌శాహిలో నాల్గవపురుషుడగు అల్లీ ఆదిల్‌శహభర్త. వీరిరువురికిని పరస్పరకలహములు కలిగియుండెను. కాని అహమ్మదనగరు బిజాపూరు, గోల కొండలకు ప్రభువులయిన తురకషహాలు కూడి విజయనగరముపై దండు వెడలుటకు నిశ్చయించుకొనిన కాలములో, అహమ్మదునగరమునకు నధిపతియయిన హుసేన్‌షహ, విజాపురమున కధిపుడయిన అల్లీషహాతో సఖ్యము చేయదలచి తన కూతురగు చాందబీబీని నతనికిచ్చి వివాహముచేసెను. తదనంతరము తేలికోటలో క్రీ.శ. 1565 వ సంవత్సరమునందీ మహమ్మదీయులకును విజయనగరాధీశ్వరుడగు రామరాజునకును యుద్ధముజరిగి విజయనగర సంస్థాన మడుగంటెనను సంగతి హిందూదేశ చరిత్రము చదివినవారి కందరకును విదితమే గాని స్త్రీ చదువరులకు నీ శాహీలసంగతి దిన్నగా దెలిసికొనినంగాని ప్రస్తుత చరితము బోధపడదు గాన వాని వివరము నిందు గొంత సంగ్రహముగా దెల్పెద.

క్రీ.శ. 1526 వ సంవత్సరమున *బ్రాహ్మణీరాజ్య ______________________________________________________________

  • డిల్లీలో గంగూయను బ్రాహ్మణుడు జఫీర్‌ఖానను తురకపిల్లవానిని బాల్యమున గొని పెంచి యింటిపని జేయుటకయి యుంచుకొనెను. పిదప నా చిన్నవాని బుద్ధివైభవము గని యాతని యజమానుడు ద్రవ్య మక్కరలేకయే యాతనిని దాస్యమునుండి విడిచెను. తదనంతర మా పిల్లవాడు దక్షిణమున రాజ్యము స్థాపించెను. అప్పు డతడు తన యజమానునియెడ గృతజ్ఞుడయి జఫీర్‌ఖాన్ గంగూ బ్రాహ్మణీ యని తన పేరు పెట్టుకొనెను. అతనిరాజ్యమే బ్రాహ్మణీరాజ్యమనం బరగెను.