పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లైనటుల నితరులకు గానేరవు. స్త్రీలు వివాహమున కన్న బూర్వము తల్లిదండ్రుల యాజ్ఞలో నుండవలయును. తదనంతరము వారికి బతియేగతి. కనుక నీవు పతియాజ్ఞలో నుండుము. ఇందువలననీకు నుభయ లోకములలో గీర్తిగలుగును. పతికంటెను మొదటలేచి స్నానము చేయుము. అతడు భోజనము చేయనిది భోజనము చేయకుము. పతి గ్రామాంతరము వెళ్ళిన యెడల అలంకారములను ధరియింపకుము. ఇటుల నరుంధత్యాది పతివ్రతలు నడిచినటుల నడుచుటయే నీకు భూషణము. పతి కోపగించినయెడల మారుమాటాడకుము. ఆయన కోపమునంతను నోర్చుకొనుము. ఇటుల జేసిన నతడు నీపై గోపమును వదలి ప్రేమింపగలడు. శాంతితో సాటి యేదియును లేదుసుమా. పతి యింట లేకుండినప్పుడు నతిథులెవరయిన వచ్చినయెడల వారిని దిన్నగా సన్మానించి యాదరించి పంపవలయును. అటుల జేయనిపక్షమున వారిలో నెవరయిన మహాత్ము లుండినయెడల గులదాహమగును. అత్తమామలను తల్లిదండ్రులవలె జూడుము. బావమరదులను నన్నదమ్ములవలె జూడుము. వీరికి గోపము వచ్చినయెడల నీకును నీభర్తకును నెంత యన్యోన్యప్రేమ ముండినను మీలో భేదము పుట్టింతురు."

ఇట్లు వారు గూతునకు బుద్ధులుగరపి యామె నత్తవారియింటి కనిపిరి. ఆ భార్యాభర్తలు తమనగరమునకు నరిగి గృహస్థాశ్రమమును జక్కగా నడుపుచుండిరి. ఇట్లు కొన్ని సంవత్సరములు గడచినపిదప నీదంపతుల విద్యాప్రావీణ్యము