పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అందు కతడు మండనమిశ్రుని విద్యాప్రభావమును బొగడి ధనముకన్నను విద్యయే శ్రేష్ఠమనిచెప్పెను. అంత నా దంపతు లిరువురును కొమార్తె కా సంగతిని దెలిపి యామె మనోభావము నెరుగ దలచి యామెసన్నిధికరిగి యాసంగతి నెరుకపరచి నీ యభిప్రాయమేమని యడిగిరి. వారావార్త చెప్పిన తోడనే యా బాల కపరిమిత సంతోషము కలిగి యాసంతోషమున కామె. మనసునం దిముడుటకు జోటుచాలక రోమాంచ రూపమున బయటబడెను. దానివలననే యామె యభిప్రాయమును వారెరిగి యావచ్చిన బ్రాహ్మణులకు దోడు తా మొకబ్రాహ్మణుని వరుని జూచుటకును, లగ్నము నిశ్చయము చేయుటకును బంపిరి. నాటికి బదునాల్గవ దినసంబున దశమినాడు శుభచంద్రయుక్తమైన ముహూర్తమని వ్రాసి గణితమునందు బ్రవీణయైన సరసవాణి తమ బ్రాహ్మణుని చేతికిచ్చెను.

అంత నాబ్రాహ్మణులు మువ్వురు కొన్నిదినములకు మండునని గ్రామమునుండి యతని తండ్రికి శుభలేఖ నందిచ్చిరి. ఆయన దాని జదివికొని సంతసించి శుభదినమునందు బంధువర్గముతో దర్లి పోయి కొమారుని వివాహము చేసెను.

కూతు రత్తవారింటికరుగునపుడు సరసవాణి తల్లిదండ్రు లామె కిట్లు బోధించిరి. "ప్రియకుమారీ! నేటినుండియు నీకు నపూర్వమైనదశ ప్రాప్తమయినది. ఈ సుస్థితికి యోగ్యమై నటుల నీవు ప్రవర్తింపుము. బాల్యమునందలి క్రీడలు విడువుము. ఏలయనగా అట్టి నీయాటలు మాకు సంతోషజనకము